Lunar Eclipse: సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం చాలా ముఖ్యమైనవి. ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది (2025) సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం కుంభరాశిలో.. పూర్వాభద్ర నక్షత్రంలో సంభవిస్తుంది. కానీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ గ్రహణం 12 రాశుల వారిపై వివిధ రకాల ప్రభావాలను చూపుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
12 రాశులపై చంద్ర గ్రహణం ప్రభావం:
మేష రాశి: ఈ రాశి వారికి స్నేహితులతో సంబంధాలు, వృత్తి పరమైన జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని సంబంధాలు బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: వృత్తి, కుటుంబ జీవితంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఇంట్లో కూడా కొన్ని బాధ్యతలు పెరగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఉన్నత విద్య, నమ్మకాలపై ప్రభావం ఉంటుంది. కొన్ని ప్రయాణాలు వాయిదా పడే ప్రమాదం ఉంటుంది. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి భావోద్వేగ పరంగా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఆర్థిక విషయాలు, వారసత్వం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. పాత సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం కూడా ఉంటుంది.
సింహ రాశి: ఈ గ్రహణం సింహ రాశి వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సంబంధాలలో మార్పులు రావచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.
కన్య రాశి: ఆరోగ్యం, పని ,లైఫ్ స్టైల్ పై దృష్టి పెట్టాలి. ఈ గ్రహణం మీ శక్తిని తగ్గించవచ్చు. అంతర్గత భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం.
తులా రాశి: ఈ రాశి వారికి సంబంధాలు, స్నేహాలు, ఆర్థిక విషయాలలో మార్పులు ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి.
వృశ్చిక రాశి: వృత్తి జీవితంలో మార్పులు సంభవించవచ్చు. ఉద్యోగంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్లడం అవసరం.
Also Read: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి
ధనస్సు రాశి: ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. గతంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
మకర రాశి: కుటుంబం, సంబంధాలపై దృష్టి పెట్టాలి. కొన్ని ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి: ఈ రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి.. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా.. ఆలోచించి వ్యవహరించాలి.
మీన రాశి: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో లాభాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టాలి.
ఇదిలా ఉంటే.. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం తర్వాత స్నానం చేసి, దానధర్మాలు చేయడం వల్ల చెడు ప్రభావాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు, శుభకార్యాలు చేయకూడదు.