LIC Bima Sakhi Yojana: కేంద్ర ప్రభత్వం మహిళల కోసం బంఫర్ ఆఫర్ తీసుకొచ్చింది. మహిళలకు ఉచితంగా 2 లక్షలు రూపాయలు ఇవ్వనుంది. అందుకోసం ఎల్‌ఐసీ ద్వారా ఒక అద్బుతమైన స్కీమ్ ను తీసుకొచ్చింది. అయితే ఆ స్కీం ఏంటి.. అది ఎవరెవరికి వర్తిస్తుంది. అందుకు ఉన్న నిబంధనలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహిళాభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్నమైన పథకాలను తీసుకొస్తుంది. అలాంటి పథకాలలో భాగంగానే మహిళలందరికీ కేంద్ర బంఫర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా మహిళలకు పార్ట్‌టైం జాబ్ ఇవ్వడమే కాకుండా వారికి ఉచితంగా 2 లక్షల రూపాయలు ఇవ్వనుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ జీవిత బీమా నుంచి కేంద్ర మహిళల కోసం ఒక వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు పార్ట్‌టైం జాబ్ ఇచ్చి ఉచితంగా రెండు లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆ పథకమే ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన. ఈ పథకంలో భాగంగా ప్రతి భారతీయ మహిళకు ఎల్‌ఐసీలో జాబ్ ఇస్తుంది ప్రభుత్వం.
జాబ్ ఎలా అప్లయ్ చేయాలి: ఎవరైనా మహిళ తాను కేంద్ర ఇస్తున్నా ఈ జాబ్ చేయాలనుకుంటే మొదటగా మీరు ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే మీకు దగ్గరలోని ఎల్‌ఐసీ ఆఫీసుకు వెళ్లి అక్కడ అడిగితే కూడా వాళ్లు మీ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.
సెలెక్షన్ ఎలా ఉంటుంది: ఎల్‌ఐసీ సఖి యోజన కోసం అప్లయ్ చేసుకున్న వాళ్లకు దగ్గరలోని ఎల్‌ఐసీ ఆఫీసులో చిన్ని ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయిన వారిని ఎల్‌ఐసీ బీమా సఖీగా ఎంపిక చేస్తారు.
వయస్సు మరియు అర్హతలు: భారతీయ మహిళ అయి ఉండి.. కనీసం పదవ తరగతి చదివి ఉండాలి. మరియు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు అర్హులు.
పని చేయు విధానం: ఈ జాబ్‌కు సెలెక్ట్ అయిన మహిళలు ప్రభుత్వం మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటుంది. సెలెక్ట్ అయిన ప్రతి మహిళ ఎల్‌ఐసీ పాలసీలు చేయించాల్సి ఉంటుంది. అయితే వీరికి టార్గెట్ ఉండదు. అలాగే సెలెక్ట్ అయిన ప్రతి మహిళకు కేంద్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం ప్రతి నెల 7 వేల రూపాయలు, రెండవ సంవత్సరం ప్రతి నెల 6 వేల రూపాయలు, మూడవ సంవత్సరం ప్రతినెల 5 వేల రూపాయలు స్టైపెండ్‌గా చెల్లిస్తుంది. అంటే మూడు సంవత్సరాలకు కలిపి దాదాపు రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఉచితంగా ఇస్తుంది. వీరు ఈ మూడు సంవత్సరాలలో ఇచ్చిన పాలసీల టార్గెట్‌లో కనీసం 65 శాతం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్లు చేయించే పాలసీల మీద అదనంగా కమిషన్ కూడా మహిళ అకౌంట్‌లోకి వస్తుంది. ఒకవేళ మూడు సంవత్సరాల తర్వాత మహిళలు తాము ఎల్‌ఐసీలో కొనసాగుతాము అనుకుంటే కొనసాగవచ్చు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి శాలరీ రాదు. అయితే పాలసీల మీద వచ్చే కమీషన్ అలాగే వస్తుంది. ఇలాగే కంటిన్యూ అయిన వాళ్లకు ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది.
ALSO READ: తెలిసో తెలియకో ఆ పనులు చేశారంటే – దరిద్ర దేవత మీ నెత్తిన తాండవం చేస్తుందట