హిందూమతంలో శ్రావణమాసానికి ఎంతో పవిత్రత ఉంది. ప్రస్తుతం జూన్ 25 నుంచి శ్రావణమాసం నడుస్తోంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి ప్రాముఖ్యత ఎక్కువ. శ్రావణ మాసంలో శివుడిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మీదేవిని వరలక్ష్మి మాత రూపంలో కొలుస్తారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడే రక్షాబంధన్ పండుగను నిర్వహించుకుంటారు. ఈరోజును శివుడుని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీరు మీ జీవితంలో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏ వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.
మీ చుట్టూ ఎంతోమంది పేదలు ఉంటారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ పేదవారికి ఆహారము, అవసరమైన డబ్బు, బట్టలు దానం చేసేందుకు ప్రయత్నించండి. ఇలా దానం చేయడం వల్ల శివుని ఆశీస్సులు మీకు దక్కుతాయి. అలాగే జీవితంలో ఆనందం, శాంతి వంటివి కూడా లభిస్తాయి.
బెల్లం
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు బెల్లం దానం చేయడం ఎంతో శుభప్రదం. హిందూ మత నమ్మకాలం ప్రకారం బెల్లాన్ని దానం చేయడం వల్ల జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది.
నువ్వుల గింజలు
నువ్వుల గింజలు కూడా దానం చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. శ్రావణ పౌర్ణమి నాడు నువ్వులను దానం చేస్తే పితృ దోషాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి.
దీపదానం
పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం చాలా ముఖ్యం. దీపదానం ఎన్నో ఫలితాలను అందిస్తుంది. శ్రావణి పౌర్ణమి రోజు శివాలయంలో దీపాన్ని వెలిగించండి. అలా చేయడం వల్ల అప్పుల బాధలు కూడా తొలగిపోయి మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఆ రోజును దీపదానం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున బియ్యము, పాలు, దానం చేస్తే చంద్ర దోషం నుండి ఉపశమనం కలుగుతుంది. సంపద కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.