Vastu tips: మనిషిని జాతకం నడిపిస్తే ఇంటిని వాస్తు రక్షిస్తుంది. వాస్తు సూత్రాలను పాటించడం వల్ల ఆ ఇంట్లో ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు వృద్ది చెందుతాయి. మీ ఇంట్లో వాస్తు సరిగ్గా ఉందో లేదో చూసుకోండి.
ప్రధాన ద్వారం: ఇంటికి వాస్తు చూసినప్పుడు ముఖ్యమైదని ప్రధాన ద్వారం. ఇది ఇంటికి తూర్ప లేదా ఉత్తరం దిశలో మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఇష్టమొచ్చిన్నట్టుగా అడ్డదిడ్డంగా ప్రధాన ద్వారం పెట్టుకుంటే ఆ ఇంట్లో కష్టాలేనట.
లివింగ్ రూం: ఇంట్లో లివింగ్ రూం ఎప్పుడైనా పడమర దిశలో ఉండాలి. లేదంటే నైరుతి దిశలో ఉండాలి. ఈ దిశల్లో ఎప్పుడూ బరువైన పర్నిచర్ పెట్టడం వల్ల ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదట.
బెడ్ రూం: ఇంట్లో బెడ్ రూం ఎప్పుడైనా నైరుతి దిశలో ఉండటం మంచిది అంటున్నారు. ఒకటి కన్నా ఎక్కువ బెడ్ రూమ్స్ ఉన్నప్పుడు మెయిన్ బెడ్ రూం మాత్రం కచ్చితంగా నైరుతి దిశలో ఉండాలి.
కిచెన్: ఇంట్లో అత్యంత ముఖ్యమైనది కిచెన్. ఇంటికి కిచెన్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆగ్నేయం దిశలో ఉండాలి అని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలా లేని పక్షంలో ఆ ఇంట్లో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుందట.
బాత్రూమ్స్: ఇంటికి బాత్రూమ్స్ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అయితే రెండవ బెడ్‌రూంలో అటాచ్డ్ గా బాత్రూం ఉన్నప్పుడు దక్షిణ బాగంలో ఉన్నా పర్వాలేదంటున్నారు.
తులసి మొక్క: ఇంటి ఆవరణలో తులసి మొక్క నాటడం వల్ల ఆ ఇంట్లో ఆరోగ్యపరమైన సమస్యలను దూరం చేస్తుందని సైంటిఫిక్ గా రుజువైంది. కానీ ఇంటి ఆవరణలో ఈశాన్యం దిశలో తులసి మొక్క నాటితే.. ఆ ఇంటి వాస్తును సరిచేస్తుందట. అయితే ఇది కొంత వరకే అని చెప్తున్నారు పండితులు. ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క దగ్గర ప్రతి రోజూ సాయంత్రం దీపం వెలిగిస్తే మంచిదని సూచిస్తున్నారు.
నీటి కుళాయి: ఇంట్ల ఉండే కుళాయిల నుంచి కూడా నీళ్లు బొట్టు బొట్టుగా కారడం మంచిది కాదంటున్నారు. ఇలా కుళాయి నుంచి నీళ్లు కారడం నెగెటివ్ ఎనర్జీకి స్వాగతం పలకడం లాంటిది అంటున్నారు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీళ్లు లీక్ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటి ఆవరణ శుభ్రంగా ఉంచడం: ఇంటి ఆవరణని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా తూర్పు, ఉత్తర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీంతో ఇంటిలో వాస్తు దోషాలు కొంతమేరకు శాంతిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
ఇంటి గోడ: ఇంట్లో గోడల విషయంలో కూడా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంట్లో తప్పకుండా తూర్పు నుంచి పడమరకు అడ్డు గోడ ఉండాలట.
ఇంకా ఇంట్లోకి గాలి, వెలుతురు తూర్పు దిశ నుంచి వచ్చేలా చూసుకోవాలట. నైరుతి మూలలో మంచాన్ని ఉంచాలట. అలాగే వంట గదిలో స్టవ్ తూర్పు ఆగ్నేయంలో ఉంచాలట. ఇక కిచెన్, బాత్రూం ఒకే గోడపై ఉండకూడదట. ఇవే కాకుండా నిపుణులు సూచించిన వాస్తు టిప్స్‌ను పాటించి వాస్తు దోషాల నుంచి తప్పించుకుని మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉండండి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం చెప్తుందంటే..?