Ind Vs Pak: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో ( Asia Cup 2025 Tournament Super Four ) భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును మరోసారి టీమిండియా చిత్తు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే… అందరూ ఎంతో ఆత్రుతగా చూస్తారు అన్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఈ రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది.
Also Read : IND VS PAK: అభిషేక్ దుమ్ములేపాడు… సూపర్ 4 లోనూ టీమిండియా విజయం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షాహిన్ ఆఫ్రిదిని బండ బూతులు తిట్టాడు అభిషేక్ శర్మ. అతని మొదటి బంతికే.. వెనకాలకు సిక్స్ బాదిన అభిషేక్ శర్మ… ఆ తర్వాత నోటికి వచ్చిన బూతు పదాలతో రెచ్చిపోయాడు. అయితే అంతకు ముందు.. టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్ కు వస్తుంటే… అఫ్రిది ( Shaheen afridi) కాస్త ఓవరాక్షన్ చేశాడట. దీంతో మొదటి బందుకే సిక్స్ కొట్టి ఆఫ్రిదికి బుద్ధి చెప్పాడు అభిషేక్. ఆ తర్వాత.. పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ. అటు హరీస్ రఫ్ కూడా అభిషేక్ శర్మను టార్గెట్ చేసి గొడవకు దిగాడు. అటు అభిషేక్ శర్మ ఏ మాత్రం తగ్గలేదు. నువ్వేంట్రా.. నీ బతుకెంత… అన్నట్లుగా అతనిపై ఎదురుదాడికి దిగాడు అభిషేక్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో నిర్ణయిత 20 ఓవర్లలో… ఐదు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 171 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోవడంతో… భారీ స్కోర్ చేయలేకపోయింది. కానీ ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. చివరలో కెప్టెన్ సల్మాన్ అలాగే ఫాహీమ్ అష్రఫ్ ఇద్దరూ పరుగులు చేసే ప్రయత్నం చేశారు. ఇక 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు టీమిండియా ప్లేయర్లు. ఇద్దరు ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 105 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు టీమిండియా. అభిషేక్ శర్మ ఏకంగా 74 పరుగులు చేయగా గిల్ 47 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ సూర్య డకౌట్ అయినప్పటికీ తిలక్ వర్మ మ్యాచ్ ఫినిష్ చేశాడు.
Also Read : IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
"Jaa Ball daal bsdk"
Abhishek Sharma to Shaheen Shah Afridi after hitting him for 6 on the first ball
🤣🤣🔥🔥 pic.twitter.com/RVLKPFxR9u
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 21, 2025