E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 650 కి.మీ రేంజ్.. 2026 ఎండింగ్ లో రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 650 కి.మీ రేంజ్.. 2026 ఎండింగ్ లో రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Upcoming Electric SUVs in India 2026: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2026 చివరి రెండు నెలల్లో టాటా మోటార్స్, హోండా, హ్యుందాయ్ సంస్థలు దేశీయంగా తయారైన మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీటిలో పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ SUVతో పాటు మిడ్‌సైజ్, కాంపాక్ట్ SUVలు కూడా ఉన్నాయి.

టాటా సఫారీ ఈవీ

టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ SUV సఫారీ ఈవీని నవంబర్ 2026లో ఆవిష్కరించే అవకాశం ఉంది. మూడు వరుసల సీట్లతో రానున్న ఈ కారు పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండనుంది. ఆరు, ఏడు సీట్ల ఎంపికలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ కారు ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో మూడు డిస్‌ప్లేలు ఉండనున్నాయి. ముందు ప్రయాణికుడి కోసం స్పెషల్ టచ్‌ స్క్రీన్‌ ను అందించే అవకాశం ఉంది. దీనిద్వారా వీడియోలు చూడటం, మ్యూజిక్ వినడం, నావిగేషన్ లాంటి పనులు చేసుకోవచ్చు. వెనుక భాగంలో ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉండటం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ SUVలో రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లు వచ్చే అవకాశముంది. ఎక్స్‌ టెండెడ్ రేంజ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది.

హోండా ఎలక్ట్రిక్ SUV

Advertisement

హోండా భారత్‌ లో తయారైన తొలి ఎలక్ట్రిక్ కారును డిసెంబర్ 2న ఆవిష్కరించే అవకాశం ఉంది. 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ మిడ్‌సైజ్ SUV 2027 జనవరిలో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. ఈ కారులో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చు. 65–75 kWh సామర్థ్యం కలిగిన LFP బ్యాటరీ ఆప్షన్స్ లభించే అవకాశముంది. టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 650 కిలోమీటర్ల రేంజ్ అందించవచ్చని అంచనా.

హ్యుందాయ్ HE1i

హ్యుందాయ్ కూడా డిసెంబర్ చివర్లో HE1i కోడ్‌ నేమ్‌ తో కొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUVను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది.  ఈ మోడల్ బాక్సీ, రగ్గడ్ డిజైన్‌తో పాటు సంస్థకు ప్రత్యేకమైన పిక్సెల్ తరహా లైటింగ్‌ను కలిగి ఉండవచ్చు. ఇంటీరియర్‌ లో 9.9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)ను అందించనున్నట్లు హ్యుందాయ్ కన్ఫార్మ్ చేసింది. రెండు బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశముండగా, పెద్ద బ్యాటరీతో సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ లభించే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పెరగనున్న పోటీ

Advertisement

టాటా, హోండా, హ్యుందాయ్ నుంచి రానున్న ఈ మూడు మోడళ్లు భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.

Read Also: ఇక అన్నికార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయం!

Tags

Related News

హోండా To జావా.. 5 అదిరిపోయే పిలియన్ సీటు బైక్ లు ఇవే!

ఇక అన్నికార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయం!

ఏప్రిలియా RS 660 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది, రేసింగ్ లుక్ అదుర్స్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పడిపోదు.. భారత్‌లో కొత్త BMW మోడల్ కు పేటెంట్!

హ్యుందాయ్ బేయాన్ ధర రేపే విడుదల.. బేసిక్ మోడల్ రేటు ఎంత ఉండొచ్చంటే?

సింపుల్ వేవ్ ఈవీలపై సూపర్ ఫెస్టివ్ ఆఫర్లు, బాబోయ్.. అంత తగ్గింపా?

డెంజా లాంచ్ డేట్ ఫిక్స్.. 600 కి.మీ. రేంజ్‌ తో అదరగొట్టేలా!

Big Stories

Advertisement
×