E-Paper
Advertisement

దీపావళికి SUV కొనేవారికి పండగే.. ఈ 10 కార్లపై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!

దీపావళికి SUV కొనేవారికి పండగే.. ఈ 10 కార్లపై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!
Advertisement

Best Diwali Offers on SUVs: దీపావళి పండుగ వేళ కొత్త కారు కొనాలనుకునే వారికి ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్‌సైజ్ SUVలపై క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా, రెనాల్ట్, జీప్, స్కోడా కంపెనీలకు చెందిన మోడళ్లపై వేరియంట్‌ ను బట్టి డిస్కౌంట్లు మారుతున్నాయి. ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తున్న పది SUVల వివరాలు ఇవే..

1.టాటా కర్వ్ EVపై రూ. 3.35 లక్షల వరకు ఆఫర్

పండుగ ఆఫర్లలో టాటా కర్వ్ EV ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ప్రీ-సిరీస్ X వేరియంట్లపై రూ. 3.35 లక్షల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌ తో పాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లు ఉన్నాయి. అయితే అన్ని వేరియంట్లకు ఒకే ఆఫర్ వర్తించదు.

2.టాటా హారియర్ EVపై రూ. 2.75 లక్షల వరకు

Advertisement

హారియర్ EVలోని ఫియర్‌ లెస్+, ఎంపవర్డ్ వేరియంట్లపై రూ. 2.75 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్లు, ఆఫ్‌రోడ్ సామర్థ్యాలతో ఈ SUV ఆకట్టుకుంటుంది. అయితే, వేరియంట్‌ను బట్టి ఆఫర్ మొత్తం మారుతుంది.

3.హోండా ఎలివేట్‌పై రూ. 2.35 లక్షల వరకు

హోండా ఎలివేట్ కొనుగోలుదారులకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిపి రూ. 2.35 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణం దీని ప్రత్యేకతలు.

4.రెనాల్ట్ డస్టర్‌పై రూ. 2.1 లక్షల వరకు

Advertisement

డస్టర్‌లోని ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 2.1 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్, సౌకర్యవంతమైన రైడ్, పెద్ద బూట్ స్పేస్ దీని ప్లస్ పాయింట్స్. పాత డస్టర్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వారికి మరిన్ని బెనిఫిట్స్   లభించే అవకాశం ఉంది.

5.మారుతి విక్టోరిస్‌పై రూ. 1.65 లక్షల వరకు

విక్టోరిస్‌లోని స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్, CNG వేరియంట్లపై వేర్వేరు ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లకు రూ. 1.65 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

మిగిలిన ఐదు SUVలపై ఆఫర్లు

⦿ జీప్ కంపాస్: ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 1.5 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.

⦿మారుతి గ్రాండ్ విటారా: వేరియంట్‌ను బట్టి రూ. 1.36 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి.

⦿ హ్యుందాయ్ క్రెటా: ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

⦿ టాటా కర్వ్: కొన్ని వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

⦿ స్కోడా కుషాక్: డీలర్, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్, లాయల్టీ ఆఫర్లతో రూ. 80,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.

Read Also: హ్యుందాయ్ బేయాన్ ధరల లిస్ట్ ఇదే.. హైదరాబాద్‌ లో ఎంతంటే?

Tags

Related News

ఏథర్ కోనార్క్ లాంచ్ వాయిదా.. అసలు కారణం ఇదే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

హ్యుందాయ్ బేయాన్ ధరల లిస్ట్ ఇదే.. హైదరాబాద్‌ లో ఎంతంటే?

గ్లోబల్ ఎంట్రీకి ముందే టీజర్ విడుదల.. హిమాలయన్ 750 ఏముంది గురూ!

లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్‌ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!

హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్‌ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!

Big Stories

Advertisement
×