Hyundai Bayon On-Road Price: కొత్త కారు కొనాలని చూస్తున్నవారికి బడ్జెట్‌తో పాటు ఆన్‌రోడ్ ధర కూడా చాలా ముఖ్యం. ఎక్స్ షోరూమ్ ధరకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపిన తర్వాతే కారు అసలు ధర తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ బేయాన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ధరలు సిటీని బట్టి మారుతున్నాయి. హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాల్లో ఈ కారు బేస్, మిడ్, టాప్ వేరియంట్ల ఆన్‌రోడ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యుందాయ్ బేయాన్ ఎక్స్‌షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ HX2, HX3, HX3+, HX5, HX6, HX8, HX10 అనే ఏడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇందులో 115hp శక్తిని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంది. వచ్చే ఏడాది CNG వేరియంట్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ బేస్ మోడల్ ఆన్‌రోడ్ ధర రూ. 11.60 లక్షలు. HX5 వేరియంట్ ధర రూ. 14.40 లక్షలు కాగా, టాప్ HX10 iVT డ్యూయల్ టోన్ ధర రూ. 20.98 లక్షలుగా ఉంది. బెంగళూరులో మాత్రం ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ బేస్ మోడల్ రూ. 12.07 లక్షలు, మిడ్ వేరియంట్ రూ. 15.02 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 22.39 లక్షలుగా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో హ్యుందాయ్ బేయాన్ బేస్ వేరియంట్ HX2 మాన్యువల్ ధర ఆన్‌రోడ్‌లో రూ. 10.88 లక్షలుగా ఉంది. HX5 మిడ్ వేరియంట్ ధర రూ. 13.52 లక్షలు కాగా, టాప్ వేరియంట్ HX10 iVT డ్యూయల్ టోన్ ధర రూ. 19.65 లక్షలుగా ఉంది.
ముంబైలో బేస్ మోడల్ కొనాలంటే రూ. 11.37 లక్షలు చెల్లించాలి. HX5 మాన్యువల్ వేరియంట్ ధర రూ. 14.12 లక్షలు కాగా, టాప్ HX10 iVT డ్యూయల్ టోన్ ధర రూ. 20.55 లక్షలుగా ఉంది. పుణెలో ఇదే వేరియంట్ల ధరలు వరుసగా రూ. 11.36 లక్షలు, రూ. 14.10 లక్షలు, రూ. 20.52 లక్షలుగా ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో హ్యుందాయ్ బేయాన్ HX2 ధర రూ. 11.12 లక్షలు. HX5 వేరియంట్ రూ. 13.80 లక్షలకు, టాప్ మోడల్ రూ. 20.10 లక్షలకు లభిస్తోంది. చెన్నైలో బేస్ వేరియంట్ ధర రూ. 11.45 లక్షలు కాగా, మిడ్ వేరియంట్ రూ. 14.22 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 20.72 లక్షలుగా ఉన్నాయి.
హ్యుందాయ్ బేయాన్ ఆన్‌రోడ్ ధరల్లో సిటీల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అంశాలు కారణమవుతాయి. ఆటోమేటిక్ వేరియంట్లను ఎంచుకునేవారు కూడా ధరలను ముందుగా పోల్చుకోవాలి. కారు కొనుగోలు చేసే ముందు సంబంధిత డీలర్‌ను సంప్రదించి తాజా ఆన్‌రోడ్ ధర, అందుబాటులో ఉన్న ఆఫర్లను తెలుసుకోవడం మంచిది.
Read Also: లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!