E-Paper
Advertisement

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్‌ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్‌ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!
Advertisement

New KTM 200 Duke Update: పాపులర్ టూ వీలర్ తయారీ సంస్థ KTM తన 200 డ్యూక్ బైక్‌ను మరిన్ని ఫీచర్లతో అప్‌ డేట్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈసారి బైక్‌ లో క్విక్‌ షిఫ్టర్, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అధికారికంగా విడుదల కాకముందే కొత్త వెర్షన్ మోడల్ డీలర్‌ షిప్‌ లో కనిపించింది. ఈ మార్పులతో బైక్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

కొత్తగా ఏ ఫీచర్లు వచ్చాయంటే?

అప్‌డేట్ చేసిన KTM 200 డ్యూక్‌ లో బై డైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీని సాయంతో క్లచ్‌ను ఉపయోగించకుండానే గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. స్పోర్టీ రైడింగ్‌ ను ఇష్టపడే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మరో కీలక మార్పు రైడ్ బై వైర్ థ్రాటిల్. ఈ టెక్నాలజీతో పాటు రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్‌ను కూడా అందించనున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ వల్ల టైర్లకు రోడ్డుపై పట్టును కోల్పోయే పరిస్థితుల్లో అదుపు చేసేందుకు సాయపడుతుంది. బైక్‌ లో స్విచ్‌ గేర్‌ ను కూడా అప్‌ డేట్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుడివైపు స్విచ్ యూనిట్‌ ను పెద్ద మోడళ్లలో ఉండే డిజైన్‌ కు దగ్గరగా మార్చారు.

ఇంజిన్‌లో మార్పులు ఉన్నాయా?

Advertisement

ఇంజిన్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 199.5cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 10,000rpm దగ్గర 25hp పవర్, 8,000rpm దగ్గర 19.3Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌ బాక్స్ యాడ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 43mm USD ఫోర్కులు, వెనుకవైపు WP మోనోషాక్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. రైడ్ బై వైర్ టెక్నాలజీ వచ్చినప్పటికీ, ఈ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ధర ఎంత పెరుగుతుందంటే?

ప్రస్తుతం KTM 200 డ్యూక్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 2.05 లక్షలుగా ఉంది. కొత్త ఫీచర్ల కారణంగా ధర సుమారు రూ. 4,000 పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే, కంపెనీ అధికారిక ధరను ఇంకా ప్రకటించలేదు.

బజాజ్ పల్సర్ NS200తో పోటీ

Advertisement

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్ తన విభాగంలో మరింత పోటీతత్వాన్ని పెంచుకోనుంది. దీనికి బజాజ్ పల్సర్ NS200 పోటీగా ఉంటుంది. పల్సర్ NS200 ధర సుమారు రూ. 1.60 లక్షల నుంచి ప్రారంభమవుతుండటంతో ధర పరంగా అది అందుబాటులో ఉంటుంది. మరోవైపు, KTM తన స్పోర్టీ పనితీరు, హ్యాండ్లింగ్‌తో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. క్విక్‌షిఫ్టర్, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లు చేరడం 200 డ్యూక్‌ కు కీలకమైన అప్‌డేట్ కానుంది. అయితే, ధర, ఫీచర్లపై పూర్తి స్పష్టత రావాలంటే KTM అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

Read Also: హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్‌ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!

Tags

Related News

లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!

హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్‌ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!

జీప్ కంపాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర రూ. 21.99 లక్షలే!

సన్‌రూఫ్ +ADAS.. రూ.10 లక్షలకే హ్యుందాయ్ కొత్త SUV!

రూ.10 లక్షల లోపు కొత్త కార్లు.. త్వరలో రానున్న టాప్ మోడళ్లు ఇవే!

మహీంద్రా థార్ E To హ్యుందాయ్ ఇన్‌స్టర్.. నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నక్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. నవంబర్‌ లో రానున్న 4 కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఇవే!

Big Stories

Advertisement
×