E-Paper
Advertisement

లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!

లగ్జరీ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. డిఫెండర్ ధర ఏకంగా రూ. 34 లక్షలు తగ్గింది!
Advertisement

Defender 110 New Prices Announced: జేఎల్‌ఆర్ (JLR) భారత మార్కెట్‌ లో తన ప్రీమియం ఎస్‌యూవీ డిఫెండర్ 110 ధరలను భారీగా తగ్గించింది. భారత్‌ లోనే స్థానికంగా అసెంబ్లీ చేయడం ప్రారంభించడంతో ఈ వెహికల్ ధరలు పెద్ద మొత్తంలో తగ్గాయి. ఇంజిన్ వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులకు రూ. 14 లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు ఆదా కానుంది. ముఖ్యంగా లగ్జరీ ఎస్‌యూవీ కొనాలని చూస్తున్న వారికి ఈ ధరల తగ్గింపు మరింత లాభం కలిగించనున్నాయి.

ధరలు తగ్గడానికి కారణం ఏంటంటే?

ఇప్పటివరకు పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డిఫెండర్ 110ను జేఎల్‌ఆర్ ఇప్పుడు కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) విధానంలో భారత్‌లో అసెంబ్లీ చేస్తోంది. అంటే, ఈ వెహికల్స్ కు సంబంధించిన విడిభాగాలను విదేశాల నుంచి తీసుకొచ్చి, దేశంలోనే వాటిని అసెంబుల్ చేస్తారు. ఈ విధానం వల్ల దిగుమతి వ్యయాలు తగ్గి, వాహనం ధరను కూడా తగ్గించే అవకాశం ఏర్పడింది. ఈ తగ్గింపు డిఫెండర్ 110 ఎక్స్ డైనమిక్ హెచ్‌ఎస్‌ఈ (X-Dynamic HSE) వేరియంట్లకు వర్తిస్తుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?

Advertisement

ధరల తగ్గింపు వివరాలను పరిశీలిస్తే.. 3.0 లీటర్ డీజిల్, 3.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ల ధరలు భారీగా తగ్గాయి. గతంలో పూర్తిగా దిగుమతి చేసుకున్న ఈ మోడళ్ల ధర రూ. 1.52 కోట్లుగా ఉండేది. ఇప్పుడు లోకల్ అసెంబ్లీ కారణంగా ఈ రెండు వేరియంట్ల ధర రూ. 1.18 కోట్లకు చేరింది. అంటే, ఒక్కో వేరియంట్‌పై రూ. 34 లక్షల వరకు తగ్గింపు లభించింది. మరోవైపు, 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర కూడా తగ్గింది. గతంలో ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.13 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ. 99 లక్షలకు చేరింది. దీంతో ఈ వేరియంట్‌పై రూ. 14 లక్షలు తగ్గింది.

ఇతర జేఎల్‌ఆర్ మోడళ్లకూ స్థానిక అసెంబ్లీ

డిఫెండర్ 110 మాత్రమే కాకుండా, జేఎల్‌ఆర్‌కు చెందిన మరికొన్ని లగ్జరీ ఎస్‌యూవీలను కూడా భారత్‌ లోనే అసెంబుల్ చేస్తున్నారు. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వెలార్, ఎవోక్‌తో పాటు డిస్కవరీ స్పోర్ట్‌ లోని ఎంపిక చేసిన వెర్షన్లు ఈ లిస్టులో ఉన్నాయి.

జేఎల్‌ఆర్ అమ్మకాల్లో డిఫెండర్ కీ రోల్

Advertisement

భారత మార్కెట్‌లో డిఫెండర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడల్ అయినప్పటికీ, డిఫెండర్ FY2026లో జేఎల్‌ఆర్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా గుర్తింపు పొందింది.  గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అమ్మకాల్లో 80 శాతానికి పైగా డిఫెండర్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల వాటానే ఉంది. లోకల్ అసెంబ్లీతో డిఫెండర్ 110 ధరలు తగ్గడం వల్ల భారత మార్కెట్‌లో ఈ లగ్జరీ ఎస్‌యూవీకి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

Read Also: జీప్ కంపాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర రూ. 21.99 లక్షలే!

Tags

Related News

గ్లోబల్ ఎంట్రీకి ముందే టీజర్ విడుదల.. హిమాలయన్ 750 ఏముంది గురూ!

కొత్త ఫీచర్లతో KTM 200 డ్యూక్.. క్విక్‌ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేశాయ్!

హీరో కరిజ్మా XMR 250 వచ్చేస్తోంది.. డీలర్‌ షిప్‌లో కనిపించిన కొత్త బైక్!

జీప్ కంపాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర రూ. 21.99 లక్షలే!

సన్‌రూఫ్ +ADAS.. రూ.10 లక్షలకే హ్యుందాయ్ కొత్త SUV!

రూ.10 లక్షల లోపు కొత్త కార్లు.. త్వరలో రానున్న టాప్ మోడళ్లు ఇవే!

మహీంద్రా థార్ E To హ్యుందాయ్ ఇన్‌స్టర్.. నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నక్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Big Stories

Advertisement
×