E-Paper
Advertisement

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!
Advertisement

Ather Energy’s Secret Sauce: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన కారణంగా చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కేవలం మంచి స్కూటర్‌ ను అందించడమే కాదు, వినియోగదారులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కల్పించే పూర్తి ఎకోసిస్టమ్‌ ను నిర్మించడం కూడా ఎంతో ముఖ్యంగా మారింది. ఈ విషయంలో ఏథర్ ఎనర్జీ దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. వినియోగదారులకు సౌకర్యవంతమైన, స్మార్ట్ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కంపెనీ అనేక ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

1.వాయిస్ కమాండ్ ఫీచర్

ఏథర్ న్యూ జెనరేషన్ స్కూటర్లలో వాయిస్ కమాండ్ ఫీచర్‌ ను అందిస్తోంది. దీని ద్వారా రైడర్లు చేతులతో బటన్లు నొక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ మాట్లాడటం ద్వారా నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ లాంటి ఫీచర్లను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తుంది.

2.ఏథర్ స్టాక్ ప్రో సబ్‌ స్క్రిప్షన్

Advertisement

ఏథర్ స్టాక్ ప్రో అనే ప్రత్యేక సబ్‌ స్క్రిప్షన్ ద్వారా స్కూటర్‌ లో మరిన్ని స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఇందులో అధునాతన రైడ్ అనలిటిక్స్, వాయిస్ కమాండ్లు, ఇతర సాఫ్ట్‌ వేర్ ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల వినియోగదారులు పూర్తి స్థాయి ఏథర్ ఎక్స్ పీరియెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది.

3.OTA సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్స్

ఏథర్ తన స్కూటర్లకు క్రమం తప్పకుండా ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌ డేట్లను అందిస్తుంది. కొత్త ఫీచర్లు, చక్కటి పనితీరు, బగ్ ఫిక్స్‌ లు పొందేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొబైల్ యాప్ ద్వారా స్కూటర్‌ ను అప్‌ డేట్ చేసుకోవచ్చు. దీంతో వాహనం కొనుగోలు చేసిన తర్వాత కూడా నిరంతరం మెరుగుపడుతూనే ఉంటుంది.

4.ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌ వర్క్

Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చాలామందికి ఉండే ప్రధాన ఆందోళన ఛార్జింగ్ సదుపాయం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏథర్ దేశ వ్యాప్తంగా ఏథర్ గ్రిడ్  పేరుతో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌ వర్క్‌ ను ఏర్పాటు చేసింది. నగరాలు, హైవేలపై వేలాది ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణ సమయంలో ఛార్జింగ్‌ పై ఆందోళన తగ్గుతుంది.

5.సెగ్మెంట్ ఫస్ట్ స్మార్ట్ ఫీచర్లు

ఏథర్ స్కూటర్లలో గూగుల్ ఆధారిత లైవ్ నావిగేషన్, బ్యాటరీ మానిటరింగ్, రైడ్ అనలిటిక్స్, రివర్స్ మోడ్, ఆటో హోల్డ్, క్రాష్ అలర్ట్‌ లు, థెఫ్ట్ సేఫ్ ఫీచర్లు, వాట్సాప్ కనెక్టివిటీ, స్కిడ్ కంట్రోల్ లాంటి పలు సదుపాయాలు ఉన్నాయి. ఇవి స్కూటర్‌ ను మరింత స్మార్ట్‌ గా, వినియోగదారులకు అనుకూలంగా మారుస్తాయి. ఈ అన్ని ఫీచర్లు కలిపి ఏథర్ స్కూటర్లను భారత మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

Read Also: ఆంపియర్‌ కు బంపర్ డిమాండ్.. 3 లక్షల మార్క్ దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×