Yamaha New Scooters 2026: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా EICMA 2026 వేదికగా ఐదు సరికొత్త స్కూటర్లను పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి అడ్వెంచర్ స్కూటర్ల వరకు అదిరిపోయే మోడళ్లను ప్రదర్శించింది. ఈ లైనప్‌లో Xenter E, NMax E, RW350, RW700, RW700 Explore ఉన్నాయి. ముఖ్యంగా RW700లో గేర్ మార్చుకునే సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కూటర్ల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
యమహా పరిచయం చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో Xenter E, NMax E స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ రెండు మోడళ్లలో 7.5kW ఎలక్ట్రిక్ మోటార్, 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇవి 125cc పెట్రోల్ స్కూటర్లకు సమానమైన సెగ్మెంట్ లోకి వస్తాయి. మోటార్ 33.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే Xenter E గరిష్టంగా 108 కిలోమీటర్లు, NMax E 104 కిలోమీటర్లు ప్రయాణించనుంది. రెండు స్కూటర్లలో 800W ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 5.5 గంటలు పడుతుంది.
Xenter Eలో 16 అంగుళాల చక్రాలు, రివర్స్ ఫంక్షన్, స్మార్ట్ కీ, 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నాయి. NMax E మాత్రం సంప్రదాయ NMax స్కూటర్ తరహా డిజైన్‌తో 13 అంగుళాల వీల్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను 2027 అందుబాటులోకి రానున్నాయి.
ఈ లైనప్‌లో RW700 అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇందులో 690cc CP2 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్‌ను యమహా Ténéré 700, MT-07, R7 వంటి మోడళ్లలోనూ ఉపయోగిస్తోంది. ఈ స్కూటర్‌లో యమహా Y-AMT ట్రాన్స్ మిషన్ ఉంటుంది. క్లచ్ లివర్, గేర్ షిఫ్ట్ పెడల్ అవసరం లేకుండానే గేర్లు మార్చుకోవచ్చు. హ్యాండిల్‌బార్‌పై ఉండే స్విచ్ ద్వారా గేర్ మార్చుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్ మోడ్‌లోనూ నడపవచ్చు. భద్రత కోసం 6-యాక్సిస్ IMU, ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, బ్రేక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
RW700 Explore మోడల్‌లో సాధారణ RW700 ఫీచర్లతో పాటు హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ రైడర్ సీటు, సెంటర్ స్టాండ్, సర్దుబాటు చేసుకునే సస్పెన్షన్ లాంటి అదనపు సదుపాయాలు ఉన్నాయి. ఇక RW350లో కొత్త 330cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. దీనికి CVT గేర్‌బాక్స్ జత చేశారు. స్ట్రీట్, ఎక్స్‌ప్లోర్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. 5 అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్ కీ, LED లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also: హోండా రెంబల్ 300 బుక్ చేసుకున్నవారికి గుడ్‌న్యూస్.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?