Diwali SUV Offers: కొత్త SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు 7 సీటర్ కారు కోసం చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. దీపావళి సందర్భంగా జీప్, సిట్రోయెన్, మహీంద్రా, హ్యుందాయ్, టాటా లాంటి కంపెనీలు తమ మూడు వరుసల SUVలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, ఫ్రీ యాక్సెసరీల రూపంలో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
జీప్ మెరిడియన్ ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.1.65 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. MY2024 స్టాక్‌పై రూ.1.3 లక్షల వరకు కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. డాక్టర్లు, లీజింగ్ కంపెనీలకు అదనంగా రూ.30,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో 170hp శక్తిని ఇచ్చే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ Xపై రూ.1.55 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ SUVలో ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లు ఉన్నాయి. దీని ధరలు రూ.8.89 లక్షల నుంచి రూ.14.52 లక్షల వరకు ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో N ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.1.5 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ ఆటోమేటిక్ Z8L, Z8T 4WD వేరియంట్లపై రూ.1.25 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ.25,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లభిస్తోంది. ఇతర వేరియంట్లపై కూడా నగదు తగ్గింపులు, ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు.
హ్యుందాయ్ అల్కాజర్ పెట్రోల్ మోడళ్లపై రూ.90,000 వరకు, డీజిల్ వేరియంట్లపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. దీని ధర రూ.14.51 లక్షల నుంచి రూ.21.81 లక్షల వరకు ఉంది.
టాటా సఫారీ డీజిల్ మోడల్ పై రూ.53,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.35,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఎంపిక చేసిన కార్పొరేట్ కస్టమర్లకు మరో రూ.8,000 తగ్గింపు లభిస్తోంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌పై రూ.40,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. S వేరియంట్‌పై రూ.30,000 వరకు, S11 వేరియంట్‌పై రూ.40,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అదనంగా రూ.25,000 విలువైన ఉచిత యాక్సెసరీలు కూడా అందిస్తున్నారు.
ఈ ఆఫర్లు సిటీని బట్టి, వేరియంట్‌ను బట్టి మారనున్నాయి. డీలర్ దగ్గర ఉన్న స్టాక్‌పై కూడా ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. కారు కొనుగోలు చేసే ముందు షోరూమ్‌లో తాజా ఆఫర్లను తెలుసుకోవడం మంచిది.
Read Also: హ్యుందాయ్ నవంబర్ ఆఫర్లు వచ్చేశాయ్.. క్రెటాపై ఏకంగా రూ.1.20 లక్షల డిస్కౌంట్!