E-Paper
Advertisement

పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!

పెట్రోల్ కాదు, ఇక ఎలక్ట్రిక్  వెర్షన్ లో వెస్పా.. రెండు కొత్త మోడళ్లు లాంచ్!
Advertisement

Vespa Electric Scooters: ప్రముఖ ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ వెస్పా ఎట్టకేలకు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. EICMA 2026 వేదికగా కొత్త వెస్పా ఎలెట్రికా (Vespa Elettrica) ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు పెట్రోల్ స్కూటర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ లోనూ  తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ కొత్త స్కూటర్ రెండు వేరియంట్లు, రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

రెండు వేరియంట్లు.. రెండు బ్యాటరీ ఆప్షన్లు

వెస్పా ఎలెట్రికా శ్రేణిలో 45 సిరీస్, 70 సిరీస్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 45 సిరీస్ 2.3kWh లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీనికి 3.1kW ఎలక్ట్రిక్ మోటార్‌ ను యాడ్ చేశారు. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక 70 సిరీస్‌లో 4.2kWh బ్యాటరీని అందించారు. ఇందులో 4kW మోటార్ ఉంటుంది. ఈ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 67 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి ఛార్జింగ్‌తో దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. సిటీ ప్రయాణాలకు ఈ రెండు మోడళ్లు ఉపయోగపడేలా రూపొందించారు.

డిజైన్‌ లో పాత వెస్పా స్టైల్

Advertisement

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలోనూ వెస్పా తన సంప్రదాయ డిజైన్‌ను కొనసాగించింది. స్టీల్ ఫ్రేమ్, మెటల్ బాడీ ప్యానెల్స్‌తో వీటిని తయారు చేశారు. 45 సిరీస్‌లో ముందు, వెనుక 12 అంగుళాల వీల్స్ ఉండగా, 70 సిరీస్‌లో ముందు 12 అంగుళాలు, వెనుక 11 అంగుళాల వీల్స్ ను ఇచ్చారు. రెండు వేరియంట్లలోనూ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ అందించారు. 70 సిరీస్‌లో అదనంగా సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది.

TFT డిస్‌ ప్లే.. స్మార్ట్ ఫీచర్లు..

ఫీచర్ల విషయంలోనూ రెండు మోడళ్ల మధ్య తేడాలు ఉన్నాయి. 45 సిరీస్‌లో అనలాగ్ తరహా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. 70 సిరీస్‌లో మాత్రం 4.3 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేను అందించారు. ఇందులో మ్యాప్ నావిగేషన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా పలు కలర్ ఆప్షన్స్ తో పాటు స్పెషల్ ప్రొడక్ట్ (RED) ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చారు.

భారత్‌లోకి వస్తుందా?

Advertisement

ప్రస్తుతం వెస్పా ఎలెట్రికా విడుదల తేదీ, ధర వివరాలను కంపెనీ ప్రకటించలేదు. భారత మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకొస్తే ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మరింత పోటీ నెలకొననుంది. ముఖ్యంగా ఏథర్, టీవీఎస్ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు వెస్పా ఆల్టర్నేట్ గా మారే అవకాశం ఉంది. భారత్‌ లో లాంచ్‌పై కంపెనీ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read Also: ఒకటి కాదు రెండు కాదు.. యమహా నుంచి ఒకేసారి 5 కొత్త స్కూటర్లు లాంచ్!

Tags

Related News

టాటా చరిత్రలో తొలిసారి.. జస్ట్ 10 నెలల్లోనే 6 లక్షలు దాటిన కార్ల అమ్మకాలు!

ఒకటి కాదు రెండు కాదు.. యమహా నుంచి ఒకేసారి 5 కొత్త స్కూటర్లు లాంచ్!

నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

రూ.30 లక్షల లోపు 7 సీటర్ SUVలపై భారీ డిస్కౌంట్లు.. ఏ కారుపై ఎంత ఆఫర్ ఉందంటే?

మారుతి డిజైర్‌కు అదిరిపోయే క్రేజ్.. 35 లక్షల యూనిట్ల తయారీ పూర్తి!

డిసెంబర్ 2న హోండా సంచలనం.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ!

హోండా రెంబల్ 300 బుక్ చేసుకున్నవారికి గుడ్‌న్యూస్.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే?

Big Stories

Advertisement
×