E-Paper

Maa Inti Bangaram OTT: సమంత ‘ మా ఇంటి బంగారం ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Maa Inti Bangaram OTT: సమంత ‘ మా ఇంటి బంగారం ‘ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Maa Inti Bangaram OTT: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. ఈ మూవీ భారీ అంచనాలతో నిన్న థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ దక్కింది. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా సమంత ఈ సినిమాలో కనిపించడంతో జనాలు ఆమెను ఇలా చూడడం మొదటిసారి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఈ సినిమాకు సమంత ఒక్కటే హైలెట్గా నిలిచింది అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.. మొత్తానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుంది? స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘మా ఇంటి బంగారం ‘ ఓటీటీ డీటైల్స్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం మా ఇంటి బంగారం.. పలు చోట్ల ప్రీమియర్ షోలు పడగా మంచి స్పందన వస్తోంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ మూవీని నిర్మించింది.. తన భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథను, స్క్రీన్ ప్లే ను అందించారు. ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది.. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలైన నెల రోజుల తరువాతనే జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్.. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది..

Advertisement

Also Read : ‘దీవానా’ రివ్యూ: ప్రేమాయణం బానే ఉంది కానీ.. కొంచెం ఓపిక చేసుకొని చూడాలి భయ్యో!

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

స్వర్ణ అనే పాత్రలో సమంత నటిస్తుంది.. ఈ మూవీలో హనీ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కుటుంబం అతని దూరం పెట్టేస్తుంది.. ఆ డాక్టర్ చెల్లి పెళ్లి కావడంతో మళ్లీ తన కుటుంబంతో కలిసి పోతాడు. ఇక చెల్లి పెళ్లిని దగ్గరుండి చెయ్యాలి అని స్వర్ణని కూడా తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు.. అక్కడ అందరూ ప్రశ్నల వర్షం కురిపించి సమంతని ఇబ్బంది పెడతారు.. కానీ మెల్లగా ఆమె వాళ్ళందరి మనసు గెలుచుకొని ఉత్తమ కోడలిగా మారుతుంది. ఈ క్రమంలో విలనైనా కరుణ మనిషిని సమంత చంపేస్తుంది. అయితే ఆ విలను సమంతని తనతో వచ్చేయమని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లేదంటే తన భర్త ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తాడు.. మరి ఈ పరిస్థితుల నుంచి స్వర్ణ ఎలా బయటపడుతుంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది అన్నది ఈ సినిమా స్టోరీ.. గతంలో ఎన్నడు కనిపించని విధంగా యాక్షన్ సన్నివేశాలలో సమంత అదరగొట్టేస్తుంది.. ఈ మూవీకి అదే హైలెట్ గా నిలుస్తుంది. మరి ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ ఎన్ని కోట్లో మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

Tags

Related News

సరికొత్త ఫాంటసీ ట్విస్ట్‌తో ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’.. ఈసారి రచ్చ మామూలుగా లేదు!

అమ్మాయి వెంటపడే ఆగంతకులు… ఆమె చేసిన పని చూస్తే బుర్ర బ్లాస్ట్

చిన్న పిల్లలను టార్గెట్ చేసే సైకో… నరాలు కట్టయ్యే థ్రిల్లర్

అమ్మాయిల తలలు నరికి చంపే ఒక సైకో గ్యాంగ్… బుర్రపాడు ట్విస్టులున్న థ్రిల్లర్

లావుగా ఉన్న మహిళలను కిడ్నాప్ చేసి ఇదేం పాడు పని… వణుకు పుట్టించే థ్రిల్లర్

హత్యలు చేస్తూ పత్రికల్లో వింత పజిల్స్… కిర్రాక్ సైకో థ్రిల్లర్

తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉండదు… లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Big Stories

×