E-Paper
Advertisement

కొత్త బజాజ్ పల్సర్ RS200 విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

కొత్త బజాజ్ పల్సర్ RS200 విడుదల.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Advertisement

2026 Bajaj Pulsar RS200 Launched: స్పోర్ట్స్ బైక్ అవర్స్ కు బజాజ్ ఆటో (Bajaj Auto) అదిరిపోయే న్యూస్ చెప్పింది. పల్సర్ RS200 (Pulsar RS200)ను సరికొత్త అప్‌డేట్స్ తో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈసారి బైక్‌ లో చిన్న ఛేంజెస్ కే పరిమితం కాకుండా, రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత మెరుగుపరిచే కీలక ఫీచర్లను యాడ్ చేసింది. కొత్త TFT డిస్‌ ప్లే, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, USD ఫ్రంట్ ఫోర్క్స్ లాంటి అప్‌గ్రేడ్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే, కొత్త ఫీచర్లకు తగ్గట్టుగానే ధర కూడా పెరిగింది.

రూ.1.98 లక్షలకు కొత్త పల్సర్ RS200

బజాజ్ కొత్త పల్సర్ RS200 ధరను కంపెనీ రూ.1.98 లక్షలుగా నిర్ణయించింది. పాత మోడల్‌ తో పోలిస్తే సుమారు రూ.17,000 ఎక్కువ. గత నెలలో పల్సర్ NS200కు అందించిన అప్‌డేట్లనే ఇప్పుడు RS200లోనూ తీసుకొచ్చింది. దీంతో ఈ స్పోర్ట్స్ బైక్ మరింత మోడ్రన్ గా మారింది.

కొత్త ఫీచర్లతో 5 అంగుళాల TFT డిస్‌ ప్లే

Advertisement

కొత్త RS200లో కీలక అప్ డేట్ 5 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్. గతంలో ఉన్న సాధారణ LCD డిస్‌ ప్లే ప్లేస్ తో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కూడా తీసుకొచ్చారు. దీంతో ప్రయాణ సమయంలో నావిగేషన్ వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ లివర్లు లాంటి అడిషనల్ ఫీచర్లను కూడా అందించారు.

రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్  

ఈసారి బైక్‌లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీని కొత్తగా చేర్చారు. దీంతో రైడర్లు తమ అవసరానికి అనుగుణంగా పలు  రైడ్ మోడ్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌ షిఫ్టర్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి బైక్ కంట్రోల్ ను మెరుగుపరచడంతో పాటు గేర్ ఛేంజెస్ ను మరింత ఈజీగా మార్చుతాయి.

మరింత ఇంజిన్ పవర్ తో.. 

Advertisement

కొత్త పల్సర్ RS200లో 199.5cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. అయితే, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ అప్‌డేట్‌తో ఇంజిన్ పవర్ 1hp పెరిగింది. ఇప్పుడు ఇది 25.5hp పవర్, 18.7Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  ముందు భాగంలో గతంలో ఉన్న టెలిస్కోపిక్ ఫోర్క్స్ స్థానంలో 37 ఎంఎం USD ఫ్రంట్ ఫోర్క్స్‌ ను ఏర్పాటు చేసింది. ఇవి బైక్ హ్యాండ్లింగ్, స్టెబులిటీని మెరుగుపరచడంలో సాయపడుతాయి.

హీరో, KTM బైక్‌లకు గట్టి పోటీ 

కొత్త RS200 రూ.1.98 లక్షలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్కెట్లో దీనికి హీరో కరిజ్మా XMRకి పోటీ ఇవ్వనుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.86 లక్షలు. మరోవైపు KTM RC 200 ధర రూ.2.33 లక్షలుగా ఉంది.

Read Also: కొనుగోలుదారులకు హీరో షాక్.. స్ప్లెండర్ ప్లస్ ధరలు భారీగా పెంపు!

Tags

Related News

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈసారి ఏకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో..

రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఫ్రాంక్స్.. బాలెనోను వెనక్కి నెట్టి మరీ సరికొత్త రికార్డు!

పెద్ద బ్యాటరీతో విండ్సర్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఇక రేంజ్ మామూలుగా ఉండదండోయ్!

కొనుగోలుదారులకు హీరో షాక్.. స్ప్లెండర్ ప్లస్ ధరలు భారీగా పెంపు!

కొత్త కార్లు, బైక్‌లకు పేర్లు ఎలా పెడతారు? బాబోయ్.. ఇంత ప్రాపెస్ ఉంటుందా?

బైక్‌లలో 100cc, 125cc, 150cc అంటే ఏంటి? ఇంజిన్ వెనుక అసలు లెక్క ఇదే!

Big Stories

Advertisement
×