E-Paper
Advertisement

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!
Advertisement

5 Fastest Cars in the World: కార్లంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా వేగంగా దూసుకెళ్లే లగ్జరీ కార్లు, సూపర్‌ కార్లంటే మరింత ఇష్టపడుతారు. సాధారణ కార్లు గంటకు 100 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే, కొన్ని ప్రత్యేక హైపర్‌ కార్లు మాత్రం ఏకంగా 400 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. అత్యాధునిక ఇంజినీరింగ్, పవర్ ఫుల్ మోటార్లు, ఏరోడైనమిక్ డిజైన్‌ తో రూపొందించిన ఈ కార్లు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి.  ఇంతకీ ఈ భూమ్మీద అత్యంత వేగంగా ప్రయాణించే టాప్ 5 కార్లు ఏవో తెలుసుకుందాం.

1.యాంగ్‌వాంగ్ U9 ఎక్స్‌ ట్రీమ్

చైనాకు చెందిన యాంగ్‌వాంగ్ U9 ఎక్స్‌ ట్రీమ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కారుగా గుర్తింపు తెచ్చుకుంది.  BYD సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఆల్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ అత్యంత వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని గరిష్ట వేగం గంటకు 312.65 మైళ్లు అంటే సుమారు 503 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ కార్లు కూడా వేగంలో పెట్రోల్ సూపర్‌ కార్లకు గట్టి పోటీ ఇవ్వగలవని ఈ కారు ప్రూవ్ చేసింది.

2.కోయినిగ్సెగ్ జెస్కో అబ్సోలట్

Advertisement

స్వీడన్‌కు చెందిన కోయినిగ్సెగ్ సంస్థ రూపొందించిన ఈ హైపర్‌కార్ వేగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని గరిష్ట వేగం గంటకు 310 మైళ్ల వరకు అంటే సుమారు 498 కి.మీ ఉంటుంది. తక్కువ గాలి నిరోధకతతో రూపొందించిన దీని డిజైన్ అత్యధిక వేగాన్ని అందుకోవడానికి కారణం అవుతుంది.

3.బుగట్టి చిరోన్ సూపర్ స్పోర్ట్ 300+  

ఫ్రాన్స్‌ కు చెందిన బుగట్టి సంస్థ రూపొందించిన ఈ కారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2019లో ఈ మోడల్ గంటకు 304 మైళ్ల వేగం అంటే సుమారు 490 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. శక్తివంతమైన W16 ఇంజిన్, ప్రత్యేక ఏరోడైనమిక్ డిజైన్ దీని ప్రధాన ఆకర్షణలు.

4.ఎస్ఎస్‌సీ టువటారా

Advertisement

అమెరికాకు చెందిన SSC నార్త్ అమెరికా సంస్థ తయారు చేసిన ఈ హైపర్‌ కార్ కూడా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. దీని డిజైన్ ప్రత్యేకంగా గాలి నిరోధకతను తగ్గించేలా ఉంటుంది. 2021లో నిర్వహించిన స్పీడ్ టెస్టులో గంటకు సగటున 455 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అత్యధికంగా గంటకు 460 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

5.కోయినిగ్సెగ్ అగెరా RS

స్వీడన్‌కు చెందిన కోయినిగ్సెగ్ అగెరా RS కూడా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. ఈ కారు 2017లో అమెరికాలోని నెవాడా హైవేలో నిర్వహించిన స్పీడ్ టెస్టులో సగటున గంటకు 447 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అత్యాధునిక ఇంజిన్, లైట్ వెయిట్ బాడీ, ఏరోడైనమిక్ డిజైన్ దీని ప్రత్యేకతలు. ఈ రికార్డుతో ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Read Also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Tags

Related News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

అక్షరాలా రూ.91 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే!

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

Big Stories

Advertisement
×