E-Paper
Advertisement

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!
Advertisement

Mahindra Upcoming Cars 2027: భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకునేందుకు మహీంద్రా (Mahindra) సరికొత్త ప్లాన్స్ తో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా 2027 తొలి ఆరు నెలల్లో నాలుగు కొత్త ప్యాసింజర్ వెహికల్స్ ను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ లిస్టులో అప్‌ డేటెడ్ థార్ రాక్స్, విజన్ ఎస్ ప్రొడక్షన్ మోడల్, BE 07 ఎలక్ట్రిక్ SUV, స్కార్పియో లైఫ్‌ స్టైలర్ పికప్ ట్రక్ ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లు ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉండగా, మరికొన్ని కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి రానున్నాయి.

కొత్త మార్పులతో మహీంద్రా థార్ రాక్స్

మహీంద్రా 5 డోర్స్ థార్ రాక్స్ ఫేస్‌ లిఫ్ట్ 2027 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.13 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త మోడల్‌ లో డిజైన్ పరంగా స్వల్ప మార్పులతో పాటు డ్రైవింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచే కొన్ని మెకానికల్ అప్‌డేట్స్ ఉండనున్నాయి. ఇటీవల 3 డోర్ల థార్‌లో పరిచయం చేసిన డావిన్సీ సస్పెన్షన్ సెటప్‌ను ఇందులోనూ అందించే అవకాశం ఉంది. దీని వల్ల గుంతల రోడ్లతో పాటు హైవేలపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఇంజిన్ విషయానికి వస్తే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఆప్షన్లు కొనసాగనున్నాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బా క్స్‌ లు యాడ్ కానున్నాయి.

టాటా నెక్సాన్‌కు పోటీగా విజన్ ఎస్

Advertisement

మహీంద్రా తీసుకురానున్న మరో కీలక మోడల్ విజన్ ఎస్ కాంపాక్ట్ SUV. దీని ప్రొడక్షన్ వెర్షన్ 2027 ఆటో ఎక్స్‌ పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది. అంచనా ధర రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది.  కంపెనీ కొత్త NU_IQ మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందనున్న తొలి SUV ఇదే కానుంది. రగ్గడ్ డిజైన్‌తో లైఫ్‌ స్టైల్ SUVగా దీనిని తీసుకురానున్నారు. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. CNG వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

BE 07

మహీంద్రా BE 07 ఎలక్ట్రిక్ SUV కూడా 2027 జూన్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందనున్న ఈ SUVలో 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది.  ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, లెవల్ 2 ADAS, గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

స్కార్పియో పికప్ కూడా..

Advertisement

ఈ నాలుగు వెహికల్స్ లో స్కార్పియో లైఫ్‌స్టైలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2027 ఏప్రిల్ నాటికి అమ్మకాలు  ప్రారంభించాలని మహీంద్రా భావిస్తోంది. స్కార్పియో-N లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందనున్న ఈ డ్యూయల్ క్యాబ్ పికప్‌ లో 2.2 లీటర్ mHawk టర్బో డీజిల్ ఇంజిన్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ 4×4 డ్రైవ్ సిస్టమ్ ఉండనున్నాయి.

Read Also: మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

Tags

Related News

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

కియా సెల్టోస్‌కు సూపర్ క్రేజ్.. ఏకంగా 7 లక్షలు దాటేసిన అమ్మకాలు!

ఫ్రిజ్, హీటర్, ఇరుకు రోడ్డులోపక్కకు తిరిగే టెక్నాలజీ.. ఈ లగ్జరీ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి డెంజా D9 ఎంట్రీ.. సింగిల్ ఛార్జ్ తో 730 కి.మీ రేంజ్, ధర ఎంత అంటే?

రూ.25 లక్షల లోపు బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్, ఫీచర్లు అదుర్స్!

Big Stories

Advertisement
×