E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా
Advertisement

Shahid Afridi Warns Team India: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో (Under-19 Asia Cup 2026 Tournament Finals) ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు పూర్తిగా డీలా పడిపోయింది. 2024 నుంచి ఇప్పటి వరకు కీలక టోర్నమెంట్స్ లలో టీమిండియా చేతిలో వరుసగా ఓడిపోతూ పాకిస్తాన్ పరువు తీసుకుంటుంది. ఇక అండర్ 19 ఫైనల్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లను రెచ్చగొడుతూ టీమిండియా క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనిపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఇక ఈ వివాదంపై షాహిద్ అఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా

క్రికెట్ లో గెలుపు ఓటములు సహజమేనని.. ఒక్క ట్రోఫీ గెలవగానే భారత కుర్రాళ్ళు రెచ్చిపోయారని షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు.. 2027లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారెంటీ అని వార్నింగ్ ఇచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా సీనియర్ జట్టును చిత్తుగా ఓడిస్తామని శపథం చేశాడు. అలా ఓడించకపోతే బట్టలు లేకుండా లాహోర్ వీధుల్లో తిరుగుతానని చాలెంజ్ విసిరాడు షాహిద్ అఫ్రిది. దీంతో షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

2027లో టీమిండియాను టార్చ‌ర్ పెట్టి, ఇంటికి పంపిస్తాం

అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఓడిపోవడం చాలా బాధాకరంగా ఉందని షాహిద్ అఫ్రిది వెల్లడించాడు. కానీ ఆ బాధతో 2027 వన్డే వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తామని శపధం చేశాడు. ఆ దిశగా తాను పాకిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేస్తానని వెల్లడించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయని వెల్లడించాడు. ఈ మూడింటిలో టీమిండియాను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటామని చాలెంజ్ విసిరాడు. అలా జరగకపోతే తన పేరు మార్చుకొని లాహోర్ వీధుల్లో బట్టలు లేకుండా నడుస్తానని షాకింగ్ స్టేట్మెంట్ చేశాడు.

భారత యువ క్రికెటర్లపై బ్యాన్ విధించాల్సిందే

Advertisement

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ గెలిచిన తర్వాత టీమిండియా కుర్రాళ్ళు రెచ్చిపోయి ప్రవర్తించారని షాహిద్ ఆఫ్రిది మండిపడ్డాడు. విజయం సాధించిన తర్వాత సంబరాలు చేసుకోవడం తప్పని తాను చెప్పడం లేదని.. కానీ ప్రత్యర్థి జట్టు ప్లేయర్ల దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. దీన్ని భారత ప్రజలు కూడా సమర్థించబోరని తెలిపాడు. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేపట్టి.. భారత కుర్ర క్రికెటర్ల పై చర్యలు తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పటి వరకు తాను న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

మ‌ళ్లీ ఐసీసీ ఛైర్మ‌న్ గా జై షానే.. 2030 వ‌ర‌కు టీమిండియా బొచ్చు కూడా పీక‌లేమంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఖ‌వాజా లీక్స్.. 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రికీ పాంటింగ్ బ్యాట్ స్ప్రింగులు పెట్టాడు!

దీపావ‌ళి నాడే గెలికారు, అందుకే చుక్క‌లు చూపించా…య‌శ్వీర్ గౌడ్ క్లారిటీ

ఇండియాకు మూడ్ వ‌చ్చిన‌ప్పుడల్లా పాకిస్తాన్ జ‌ట్టును చిత్తుగా ఓడిస్తోంది

మా వెధ‌వలు ముందు గెలికారు..అందుకు టీమిండియా కుర్రాళ్లు దూల తీర్చారు

య‌శ్వీర్ గౌడ్ ను చెప్పుల‌తో కొట్టాలి…పాకిస్తాన్ మాజీ మంత్రి సంచ‌ల‌నం!

2 రోజుల్లో రెండు ట్రోఫీలా? ఫిక్సింగ్ చేసి గెలిచారంటూ ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×