E-Paper
Advertisement

కొత్త ఇన్నోవా టీజర్ విడుదల.. హైక్రాస్ లుక్ కంప్లీట్ గా మారిపోనుందా?

కొత్త ఇన్నోవా టీజర్ విడుదల.. హైక్రాస్ లుక్ కంప్లీట్ గా మారిపోనుందా?
Advertisement

New Toyota Innova Hycross: భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) త్వరలో కొత్త లుక్ లో రాబోతోంది. ఈ MPV ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను టయోటా కిర్లోస్కర్ మోటార్ విడుదల చేసింది. నవంబర్ 25, 2026న ఈ కొత్త మోడల్‌ను అధికారికంగా పరిచయం చేయనుంది. ఇప్పటికే రోడ్లపై కనిపించిన టెస్ట్ మోడల్స్ ను బట్టి చూస్తే.. కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో డిజైన్, ఇంటీరియర్, టెక్నాలజీ పరంగా పలు మార్పులు ఉండనున్నాయి.

ముందు భాగంలో కొత్త లుక్

కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ మారనుంది. టయోటా టైసర్ SUVని పోలిన కొత్త LED DRLలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు కొత్త స్లాటెడ్ గ్రిల్, మారిన ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా మార్పులు ఉండనున్నాయి. కొత్త LED టెయిల్‌ ల్యాంప్‌లు, అప్ డేటెడ్ రియర్ బంపర్‌తో పాటు కొన్ని చిన్న చిన్న డిజైన్ అప్‌ డేట్స్ కనిపించవచ్చు. అయితే, ప్రస్తుత మోడల్‌లోని  వీల్ ఆర్చ్‌ లు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా లాంటివి అలాగే కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

పెద్ద టచ్‌ స్క్రీన్‌తో కొత్త ఇంటీరియర్

Advertisement

క్యాబిన్ విషయంలోనూ టయోటా కొన్ని కీలక మార్పులు చేయనుంది. ఇండోనేషియాలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన కిజాంగ్ ఇన్నోవా జెనిక్స్ మాదిరిగానే కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న డిస్‌ప్లే కంటే ఇది పెద్దదిగా ఉండనుంది. కొత్త 7 అంగుళాల TFT MID, అప్‌డేటెడ్ ఇంటీరియర్ ట్రిమ్స్, కొత్త అప్‌హోల్స్టరీ ఆప్షన్లను కూడా అందించవచ్చని తెలుస్తోంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ ఇంజిన్

ఇంజిన్ విషయంలో ప్రస్తుత మోడల్‌లోని 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కొనసాగనుంది. అయితే ఈసారి ఇంజిన్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హై ఇథనాల్ పెట్రోల్‌ తో కూడా వాహనం నడిచే అవకాశం ఉంటుంది. CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యథావిధిగా కొనసాగనుంది.

ధర ఎంత ఉంటుందంటే?   

Advertisement

కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా ఇన్నోవా హైక్రాస్ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.19.53 లక్షల నుంచి రూ.21.12 లక్షల వరకు ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ.26.76 లక్షల నుంచి రూ.32.95 లక్షల వరకు ఉన్నాయి. కొత్త మోడల్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, వేరియంట్లు, ధరలను నవంబర్ 25న టయోటా వెల్లడించనుంది.

Read Also: కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

Tags

Related News

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

అక్షరాలా రూ.91 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే!

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

అదిరిపోయే లుక్‌ లో టాటా నెక్సాన్.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×