E-Paper
Advertisement

హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!

హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!
Advertisement

Honda New Cars 2026: ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) డిసెంబర్‌లో రెండు కొత్త SUVలను మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తోంది. హోండా అవన్సియర్ (Honda Avancier), హోండా ఆల్ఫా EV (Honda Alpha EV) పేర్లతో వీటిని పరిచయం చేయనుంది. వీటిలో అవన్సియర్ న్యూ జెనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానుండగా, ఆల్ఫా EV పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ రెండు కార్లలో ఆల్ఫా EV మాత్రమే భారత మార్కెట్లోకి రానుంది.

డిసెంబర్ 1న హైబ్రిడ్ అవన్సియర్ ఆవిష్కరణ

హోండా అవన్సియర్ SUVని డిసెంబర్ 1, 2026న థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించనున్నారు. కంపెనీ గ్లోబల్ లైనప్‌ లో ఇది CR-V కంటే పై స్థాయిలో ఉండనుంది. ఏడు సీట్ల సామర్థ్యంతో రూపొందుతున్న ఈ SUV టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ శాంటా ఫే, కియా సోరెంటో, స్కోడా కోడియాక్ లాంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేసే 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉండవచ్చని తెలుస్తోంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా అందించే అవకాశం ఉంది.

అదిరిపోయే డిజైన్‌తో కొత్త అవన్సియర్

Advertisement

ఈ SUVలో సన్నని LED హెడ్‌ ల్యాంప్‌లు, ప్రత్యేకమైన DRLలు ఉండనున్నాయి. వెనుక భాగంలో ఎరుపు రంగు లైట్ స్ట్రిప్‌తో నిలువుగా అమర్చిన టెయిల్‌ ల్యాంప్‌లు ఆకర్షణగా నిలవనున్నాయి. కొత్త హోండా లోగో, యానిమేటెడ్ లైటింగ్ సీక్వెన్స్ లాంటి అంశాలు కూడా ఇందులో ఉండవచ్చు. ఈ SUV సుమారు 4,960 మి.మీ పొడవు, 1,950 మి.మీ వెడల్పు, 1,690 మి.మీ ఎత్తుతో ఉండనుంది. అయితే, అవన్సియర్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

డిసెంబర్ 2న భారత్‌ లో ఆల్ఫా EV ఎంట్రీ

డిసెంబర్ 2 హోండా ఆల్ఫా EVని భారత్‌లో అధికారికంగా పరిచయం చేయనున్నారు. హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజస్థాన్‌ లోని తపుకారా ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనున్నారు.

Advertisement

ఈ EVలో 65kWh నుంచి 75kWh సామర్థ్యం కలిగిన LFP బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ఒకే ఎలక్ట్రిక్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సిస్టమ్‌ తో వచ్చే అవకాశం ఉంది. అయితే, బ్యాటరీ, మోటార్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

క్రెటా EV, BE 6లకు పోటీగా ఆల్ఫా EV

ఆల్ఫా EVలో లైటింగ్ హోండా లోగో, ప్రత్యేకమైన హెడ్‌ల్యాంప్‌లు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, U ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. SUV తరహా రూపంతో పాటు విశాలమైన క్యాబిన్‌ను అందించేలా దీన్ని రూపొందిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఇ-విటారా, టయోటా ఎబెల్లా, టాటా సియెర్రా EV, మహీంద్రా BE 6 లాంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Read Also: కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

Tags

Related News

కొత్త ఇన్నోవా టీజర్ విడుదల.. హైక్రాస్ లుక్ కంప్లీట్ గా మారిపోనుందా?

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

అక్షరాలా రూ.91 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే!

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. సైబర్‌ట్రక్ ఉత్పత్తి గడువు మరో 3 నెలలు పెంపు, ఎందుకంటే?

Big Stories

Advertisement
×