E-Paper
Advertisement

మారుతి బ్రెజ్జా టర్బో 1,200 కి.మీ. రివ్యూ.. మైలేజ్ ఎంత? పనితీరు ఎలా ఉందంటే?

మారుతి బ్రెజ్జా టర్బో 1,200 కి.మీ. రివ్యూ.. మైలేజ్ ఎంత? పనితీరు ఎలా ఉందంటే?
Advertisement

Maruti Brezza Turbo Review: మారుతి సుజుకీ బ్రెజ్జా మార్కెట్ లో మంచి వ్యాల్యూ కలిగిన కాంపాక్ట్ SUVగా గుర్తింపు పొందింది. ఇప్పుడు బూస్టర్‌ జెట్ టర్బో ఇంజిన్, కొత్త 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో వచ్చిన బ్రెజ్జా టర్బోను లాంగ్‌ టర్మ్ టెస్ట్‌ లో కీలక విషయాలను పరిశీలించారు. సుమారు 1,200 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఈ కారులోని ప్లస్, మైనస్ లు గుర్తించారు.

ట్రాఫిక్‌లో టర్బో ఇంజిన్ పనితీరు ఎలా ఉంది?

బ్రెజ్జాలోని బూస్టర్‌జెట్ ఇంజిన్ చాలా స్మూత్ గా పని చేస్తుంది. ముఖ్యంగా టర్బో లాగ్ ఉంటుందేమోనన్న డౌట్ సిటీ ట్రాఫిక్‌ లో ఎక్కువగా కనిపించలేదు. 2,000 rpm దగ్గర గరిష్ట టార్క్ అందుబాటులోకి రావడం, లో గేర్ రేషియో ఉండటం వల్ల కారు వేగంగా స్పందిస్తుంది. అయితే, 1,500 rpm కంటే తక్కువ వేగం దగ్గర కొద్దిగా టర్బో లాగ్ అనిపిస్తుంది. ఆ పరిధి దాటిన తర్వాత స్పీడ్ స్టడీగా పెరుగుతుంది. ఇంజిన్‌ లో ప్రకంపనలు తక్కువగా ఉండటం, మైల్డ్ ఈ బూస్ట్ సాకారం వల్ల తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

గేర్‌ బాక్స్, ఫీచర్లు ప్లస్ పాయింట్స్

Advertisement

6-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్, లైట్ క్లచ్ సిటీ ప్రయాణాన్ని ఈజీ చేస్తాయి. గేర్లు సాఫీగా మారడంతో ట్రాఫిక్‌లో కూడా డ్రైవింగ్ ఇబ్బంది అనిపించదు. అవసరమైనప్పుడు వేగంగా గేర్ తగ్గించుకోవడం కూడా ఈజీ కానుంది. ఫీచర్ల విషయానికి వస్తే, వైర్‌లెస్ ఛార్జింగ్, సూపర్ ఆడియో సిస్టమ్, పెద్ద స్క్రీన్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌ వేర్ ఆకట్టుకుంటాయి. ఫోన్‌ను త్వరగా కనెక్ట్ చేయడం, ఆపిల్ కార్‌ ప్లే ఉపయోగించడం ఈజీగా ఉంది. కెమెరాల క్వాలిటీ కూడా బాగుంది.

మైనస్ పాయింట్లు ఏంటంటే?   

బ్రెజ్జా టర్బో డిజైన్ మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. రెడ్ కలర్ హైలైట్స్, టర్బో స్టిక్కర్ కొంత అతిగా అనిపిస్తాయి. డ్యాష్‌బోర్డ్ కూడా పాతదిగా కనిపిస్తుంది. ట్రాఫిక్‌ లో ప్రాక్సిమిటీ సెన్సార్ల కారణంగా కెమెరాలు పదేపదే ఆన్ కావడం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, పాత బ్రెజ్జాలో కనిపించిన యాక్టివ్ నెస్, మలుపుల్లో ఉండే డ్రైవింగ్ ఫన్ కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు, కొన్ని ADAS ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ ఉన్నా కొత్తదనం లోపించిన ఫీలింగ్ కలుగుతుంది.

స్పేర్ టైర్ లేకపోవడం పెద్ద సమస్య

Advertisement

ఈ కారులో స్పేర్ టైర్‌ను తొలగించడం మరో ముఖ్యమైన మైనస్. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణించేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. పంక్చర్ రిపేర్ కిట్‌పై మాత్రమే ఆధారపడకుండా అడిషనల్ స్పేర్ టైర్ కొనుగోలు చేసుకోవడం మంచిదని టెస్ట్ డ్రైవర్ వెల్లడించారు.

బ్రెజ్జా టర్బో టెస్ట్ గురించి..

ఈ టెస్ట్ లో మారుతి బ్రెజ్జా టర్బో ZXi+ మోడల్ ను ఉపయోగించారు. టెస్ట్ చేసిన దూరం 1,200 కి.మీ. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.25 లక్షలు. మైలేజీ 12.1 కి.మీ./లీటర్ గా తేలింది. బ్రెజ్జా టర్బో ఇంజిన్ పనితీరు, గేర్‌బాక్స్, సౌకర్యవంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అయితే, డిజైన్, డ్రైవింగ్ యాక్టివ్ నెస్, స్పేర్ టైర్ లాంటి అంశాల్లో మరింత  మెరుగుదల అవసరమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read Also: హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!

Tags

Related News

హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!

కొత్త ఇన్నోవా టీజర్ విడుదల.. హైక్రాస్ లుక్ కంప్లీట్ గా మారిపోనుందా?

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

అక్షరాలా రూ.91 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్ ఇదే!

మహీంద్రా బిగ్ ప్లాన్.. ఒకేసారి 4 సూపర్ మోడల్స్ రిలీజ్!

మారుతి నుంచి రెండు అదిరిపోయే కార్లు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

Big Stories

Advertisement
×