Top Electric Scooters Under Rs.1 Lakh: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రోజూ ఆఫీసులకు వెళ్లేవాళ్లు, సిటీల్లో చిన్న చిన్న పనుల కోసం ప్రయాణించేవారు ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, తక్కువ ధరలో మంచి రేంజ్, అవసరమైన ఫీచర్లు ఉన్న స్కూటర్‌ను సెలెక్ట్ చేసుకోవడం కొంత కష్టమే. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.1 లక్ష లోపు బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీవీఎస్ నుంచి వచ్చిన ఆర్బిటర్ V2 రోజువారీ ప్రయాణాలకు బాగుంటుంది. ఇందులో 3.1 kWh వరకు బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 86 నుంచి 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. తక్కువ బరువు, కుటుంబ అవసరాలకు సరిపోయే డిజైన్ దీని ప్రత్యేకత. అంచనా ధర రూ.88,250 నుంచి రూ.99,250 వరకు ఉంది.
తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి ఓలా S1 X మరో బెస్ట్ ఆప్షన్. ఇది 2 kWh, 3 kWh బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి సుమారు 108 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. మంచి డిజైన్, సూపర్ యాక్సిలరేషన్, అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.84,999.
హోండా బ్రాండ్‌పై నమ్మకంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారు QC1ను చూడవచ్చు. ఇందులో 1.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. కేవలం 89.5 కిలోల బరువు ఉండటంతో నగర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.90,490 నుంచి ప్రారంభమవుతుంది.
హీరో మోటోకార్ప్ కు చెందిన విడా VX2 కూడా ఈ లిస్టులో ఉంది. గో, ప్లస్ వేరియంట్లలో లభించే ఈ స్కూటర్‌లో 2.2 kWh నుంచి బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి 93 నుంచి 187 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. సౌకర్యవంతమైన డిజైన్, బ్యాటరీ ఆప్షన్స్ దీని ప్రత్యేకతలు. ప్రారంభ ధర సుమారు రూ.74,490.
తక్కువ ధరలో కుటుంబ అవసరాలకు సరిపోయే స్కూటర్ కోసం చూస్తున్నవారికి యాంపియర్ మాగ్నస్ నియో ఉపయోగపడుతుంది. ఇందులో 2.3 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 నుంచి 125 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, ఆధునిక డిజైన్ దీని ప్రత్యేకతలు. ధర సుమారు రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 బైకులు.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్!