TVS Jupiter 125 ABS Model Spotted: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ TVS మోటార్ జూపిటర్ 125 స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ కొత్త మోడల్ ఇప్పటికే డీలర్ల స్టాక్ యార్డుల్లో కనిపించింది. కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సింగిల్ ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. 2021లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన జూపిటర్ 125కు ఇప్పటి వరకు పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, కొత్త ABS వేరియంట్ రాకతో ఈ స్కూటర్‌కు మరింత క్రేజీగా కనిపించనుంది. ప్రస్తుతం 150cc లోపు స్కూటర్ల సెగ్మెంట్ లో ABS ఉన్న మోడళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం TVS జూపిటర్ 125 నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో టాప్ వేరియంట్ SmartXonnect ధర రూ.91,235గా ఉంది. కొత్తగా రానున్న ABS వేరియంట్ ధర దీనికంటే సుమారు రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఎక్కువగా ఉంటుందని అంచనా. అంటే కొత్త స్కూటర్ ధర సుమారు రూ.97,000 నుంచి రూ.98,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే, ధర విషయంలో కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో SmartXonnect వేరియంట్ లో లభించే TFT డిస్ ప్లే ఉండకపోవచ్చు. దానికి బదులుగా DT SXC వేరియంట్ లో ఉన్న నెగటివ్ LCD డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 150cc లోపు సింగిల్ ఛానల్ ABS కలిగిన స్కూటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. సుజుకి యాక్సెస్ 125 ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే ABS సదుపాయంతో అందుబాటులో ఉంది. దీని Ride Connect ABS వేరియంట్ ధర రూ.98,432గా ఉంది. నాన్-ABS వేరియంట్‌తో పోలిస్తే సుమారు రూ.6,805 ధర తేడా ఉంది. TVS రైడర్ 125లో కూడా సింగిల్ ఛానల్ ABS అందుబాటులో ఉంది. కొత్త జూపిటర్ 125 రాకతో ఈ విభాగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
కొత్త వేరియంట్ లో ABS మినహా డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇంజిన్, ఇతర మెకానికల్ అంశాలు కూడా ప్రస్తుత మోడల్ లో ఉన్నట్లుగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జూపిటర్ 125లో 124.8cc ఇంజిన్ ఉంది. ఇది 8.57hp పవర్, 11.1Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ మోటార్ జనరేటర్ (ISG) టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.
కొత్త ABS వేరియంట్ ఇప్పటికే డీలర్ స్టాక్‌యార్డులకు చేరుతున్నట్లు సమాచారం. దీంతో TVS త్వరలోనే దీని ధర, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం స్కూటర్ కొనాలనుకునే వారిని కొత్త జూపిటర్ 125 మరింతగా ఆకట్టుకోనుంది.
Read Also: డిసెంబర్ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!