E-Paper
Advertisement

పండుగ సీజన్‌ లో లక్ష దాటిన ట్రాక్టర్ల అమ్మకాలు.. ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?

పండుగ సీజన్‌ లో లక్ష దాటిన ట్రాక్టర్ల అమ్మకాలు.. ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?
Advertisement

Tractor Sales: భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2026 పండుగ సీజన్ ట్రాక్టర్ కంపెనీలకు మంచి గ్రోత్ ను అందించింది. వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లకు ఉన్న డిమాండ్ మరోసారి వెల్లడి అయ్యింది. ఈ ఏడాది పండుగ సీజన్‌ లో దేశవ్యాప్తంగా ట్రాక్టర్ల అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కును దాటాయి. ముఖ్యంగా మహీంద్రా, స్వరాజ్ బ్రాండ్లు మార్కెట్లో దూసుకెళ్లాయి.  ఆ తర్వాత స్థానాల్లో ఏ కంపెనీలు నిలిచాయంటే..

పండుగ సీజన్‌లో 1.03 లక్షల ట్రాక్టర్ల అమ్మకం 

2026 పండుగ సీజన్‌లో మొత్తం 42 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 1,03,809 ట్రాక్టర్లు రిజిస్టర్ అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 1,01,532 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, ఈసారి 2.24 శాతం వృద్ధి నమోదైంది. ఇక 2024 పండుగ సీజన్‌తో పోలిస్తే ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 17.31 శాతం పెరిగాయి. వరుసగా రెండో ఏడాది కూడా పండుగ సీజన్‌లో ట్రాక్టర్ విక్రయాలు లక్ష యూనిట్లను దాటడం విశేషం.

మహీంద్రా, స్వరాజ్ హవా..  

Advertisement

ట్రాక్టర్ మార్కెట్లో మహీంద్రా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. అక్టోబర్ 2026లో మహీంద్రా ట్రాక్టర్ విభాగం 18,263 యూనిట్లను విక్రయించి 23.03 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. మరోవైపు స్వరాజ్ బ్రాండ్ 14,206 యూనిట్ల అమ్మకాలతో 17.92 శాతం వాటాను దక్కించుకుంది. ఈ రెండు బ్రాండ్లు కలిపి 32,469 ట్రాక్టర్లను విక్రయించాయి. అంటే, అక్టోబర్ నెల మొత్తం ట్రాక్టర్ మార్కెట్లో వీటి వాటా 40.95 శాతంగా ఉంది.

టాప్ 5లో నిలిచిన ట్రాక్టర్ కంపెనీలు..

అక్టోబర్ నెల అమ్మకాల ఆధారంగా టాప్ కంపెనీల లిస్టును పరిశీలిస్తే..

Advertisement

1.మహీంద్రా – 18,263 యూనిట్లు

2.స్వరాజ్ – 14,206 యూనిట్లు

3.సోనాలికా – 10,364 యూనిట్లు

4.TAFE – 9,256 యూనిట్లు

5.కుబోటా – 8,331 యూనిట్లు

జాన్ డీర్ 6,439 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఐషర్ 4,858 యూనిట్లు, CNH ఇండస్ట్రియల్ 3,992 యూనిట్లను అమ్మాయి.

సోనాలికా అమ్మకాల్లోనూ మంచి గ్రోత్

అక్టోబర్ నెలలో సోనాలికా ట్రాక్టర్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 13.26 శాతం పెరిగాయి. CNH ఇండస్ట్రియల్ ఏకంగా 28.94 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే TAFE అమ్మకాలు మాత్రం 4.53 శాతం తగ్గాయి.  అక్టోబర్ నెలలో ట్రాక్టర్ మార్కెట్ 3.10 శాతం వృద్ధి సాధించింది.

Read Also: థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

Tags

Related News

ఆంపియర్ నుంచి కొత్త EV.. 3 నెలల్లో ఐస్‌బ్రేకర్ లాంచ్!

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

TVS జుపిటర్ 125 కొత్త వేరియంట్.. త్వరలోనే లాంచ్!

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పండుగ సీజన్‌లో భారీ డిమాండ్.. ఏకంగా 61 శాతం పెరిగిన అమ్మకాలు!

JSW కాంబాట్ SUV వచ్చేస్తోంది.. తొలి 500 మందికి అదిరిపోయే స్పెషల్ ఆఫర్!

ఇన్విక్టోలో టయోటా మ్యాజిక్.. ఇక E85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌ తో పరుగులు!

Big Stories

Advertisement
×