E-Paper
Advertisement

టూవీలర్ మార్కెట్లోకి చైనా దిగ్గజం చెరీ.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు రెడీ!

టూవీలర్ మార్కెట్లోకి చైనా దిగ్గజం చెరీ.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు రెడీ!
Advertisement

Chery’s New Two-Wheeler Concepts: చైనా ఆటోమొబైల్ దిగ్గజం చెరీ (Chery) ఇప్పుడు టూ వీలర్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు కార్ల తయారీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, క్రూజర్ బైక్‌ల రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఇందుకోసం సినాక్స్ (CINAX), లిన్వియా (Linvia) పేర్లతో కొత్త సబ్ బ్రాండ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మూడు క్రేజీ టూవీలర్ కాన్సెప్ట్‌ లను ప్రదర్శించింది. వీటిలో రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ కాగా, మరొకటి హబ్‌లెస్ వీల్ డిజైన్‌ తో ఆకట్టుకుంటుంది.

పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఎలక్ట్రిక్ క్రూజర్!

చెరీ ప్రదర్శించిన మూడు కాన్సెప్ట్‌ లలో గ్రో సి3 (Grow C3) ఆసక్తి కలిగిస్తోంది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్‌లతో పోల్చితే పూర్తి డిఫరెంట్ గా రేంజ్ ఎక్స్‌ టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (REEV) టెక్నాలజీతో తయారు చేశారు. అంటే, ఈ వెహికల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాటరీలోని విద్యుత్‌తోనే ఇది నడుస్తుంది. అయితే, బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినప్పుడు పెట్రోల్ ఇంజిన్ పనిచేసి బ్యాటరీని తిరిగి ఛార్జ్ చేస్తుంది. దీంతో ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే, ఇలాంటి టెక్నాలజీని వెహికల్ లో ఫిక్స్ చేయడం, ఇంజినీరింగ్ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

హబ్‌ లెస్ వీల్‌తో మరో కొత్త స్కూటర్

Advertisement

చెరీ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌ ను కూడా ప్రదర్శించింది. ఇందులో బ్యాక్ వీల్ మధ్యలో సాధారణ హబ్ లేకుండా ప్రత్యేకమైన హబ్‌ లెస్ డిజైన్‌ను ఉపయోగించారు. మధ్యలో అమర్చిన మోటార్ నుంచి చైన్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ అందుతుంది. ఈ స్కూటర్‌ లో హ్యాండిల్‌ బార్‌ ను అవసరానికి అనుగుణంగా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కూర్చుని ప్రయాణించడంతో పాటు, కొంతవరకు నిటారుగా నిలబడి నడిపే విధంగా కూడా దీన్ని రూపొందించి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ మోడల్ పేటెంట్ డిజైన్ దశలోనే ఉంది. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై క్లారిటీ లేదు.

జేఎస్‌డబ్ల్యూ భాగస్వామ్యంతో భారత్‌లోకి ఎంట్రీ

చెరీ సంస్థకు చైనాలో కార్ల తయారీలో మంచి గుర్తింపు ఉంది. జేకూ (Jaecoo), జెటూర్ (Jetour), ఒమోడా (Omoda), ఐకార్ (iCAR) లాంటి బ్రాండ్ల ద్వారా పలు సెగ్మెంట్లలో వాహనాలను అమ్ముతోంది. ఇటీవల భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తో ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జెటూర్ కార్లను జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ పేరుతో తీసుకురావాలని భావిస్తోంది. అయితే, చెరీ కొత్త టూ వీలర్స్ ను భారత్‌లో విడుదల చేస్తుందా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో సత్తా.. ఏకంగా ఓలాను దాటేసిందిగా!

Tags

Related News

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో సత్తా.. ఏకంగా ఓలాను దాటేసిందిగా!

హ్యుందాయ్ నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

పండుగ సీజన్‌ లో లక్ష దాటిన ట్రాక్టర్ల అమ్మకాలు.. ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?

ఆంపియర్ నుంచి కొత్త EV.. 3 నెలల్లో ఐస్‌బ్రేకర్ లాంచ్!

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

TVS జుపిటర్ 125 కొత్త వేరియంట్.. త్వరలోనే లాంచ్!

డిసెంబర్‌ లో కొత్త కార్ల పండగ.. జస్ట్ రెండు వారాల్లో ఏకంగా 6 మోడల్స్ విడుదల!

Big Stories

Advertisement
×