E-Paper

బెడ్‌లా మారే సీట్లు, 548 కిమీ రేంజ్.. ప్రభుదేవా కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే!

బెడ్‌లా మారే సీట్లు, 548 కిమీ రేంజ్.. ప్రభుదేవా కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Prabhu Deva’s New MG M9 EV: సినీ తారలు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు లగ్జరీ ఈవీలు కొనుగోలు చేయగా, తాజాగా ఈ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా చేరారు.  తాజాగా ఆయన విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీలోకి తెచ్చుకున్నారు. సరికొత్త MG M9 ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీని కొనుగోలు చేశారు. ఇటీవల ఈ కారును ఆయన డెలివరీ తీసుకున్నారు. ఈ కొత్త ఈవీతో ప్రభుదేవా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

MG M9 ఈవీ గురించి..

ప్రభుదేవా తీసుకున్న MG M9 కాంక్రీట్ గ్రే రంగులో ఉంది. ఈ లగ్జరీ ఎంపీవీని ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్ గా ప్రచారం చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారత మార్కెట్లో లగ్జరీ సెగ్మెంట్ కోసం ఎంజీ తీసుకొచ్చిన తొలి కారు MG M9. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌ తో నడిచే పెద్ద ఎంపీవీ. పరిమాణం పరంగా చూస్తే కియా కార్నివాల్, టయోటా వెల్‌ ఫైర్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఈ కారు పొడవు 5,270 మిల్లీమీటర్లు కాగా, వీల్‌ బేస్ 3,200 మిల్లీమీటర్లు. అందుకే లోపల ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలం లభిస్తుంది. బయటి లుక్ కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఇందులో LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌ లు, పెద్ద గ్రిల్, క్రోమ్ ఫినిషింగ్, భారీ గ్లాస్ ఏరియా, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌ లు లాంటి ప్రీమియం డిజైన్ అంశాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ లోనే హైఎండ్ లగ్జరీ  వెహికల్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇంటీరియర్ గురించి..

Advertisement

MG M9లో కాగ్నాక్, బ్లాక్ కలర్ థీమ్‌ తో విలాసవంతమైన క్యాబిన్‌ ను అందించారు. బ్రష్డ్ అల్యూమినియం, వుడ్ ఫినిష్ ఇన్‌ సర్ట్‌ లు కారులో ప్రీమియం ఫీల్‌ ను కలిగిస్తాయి. లేత రంగు రూఫ్ లైనర్ కారణంగా క్యాబిన్ మరింత విశాలంగా కనిపిస్తుంది. ఈ ఎంపీవీ మొత్తం ఏడు సీట్లతో వస్తుంది. రెండో వరుసలో ఉన్న కెప్టెన్ సీట్లు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ సీట్లను టచ్‌ స్క్రీన్ ద్వారా కంట్రోల్ చెయ్యొచ్చు. సీట్ హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌ మెంట్ లంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అవసరమైతే ఈ సీట్లను పూర్తిగా బెడ్‌ లా మార్చుకోవచ్చు.

ఇందులో 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, రియర్ ఎంటర్‌ టైన్‌ మెంట్ స్క్రీన్లు, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, వైర్‌ లెస్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS, మెమరీ సీట్లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ స్లైడింగ్ డోర్లు లాంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఒకే ఛార్జ్ తో 548 కి.మీ రేంజ్

Advertisement

MG M9 పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్. ఇందులో 90 kWh బ్యాటరీ ప్యాక్‌ ను అందించారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 242 bhp శక్తి, 350 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ ఎంపీవీ ధర రూ.70.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ MG షోరూమ్‌ లలో కాకుండా ప్రత్యేక MG Select డీలర్‌ షిప్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుదేవా మాత్రమే కాకుండా హేమా మాలిని, శంకర్ మహాదేవన్, కేఎల్ రాహుల్, కృష్ణ అభిషేక్ లాంటి పలువురు ప్రముఖులు కూడా ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని కొనుగోలు చేశారు. MG M9 ప్రస్తుతం సెలబ్రిటీలకు ఇష్టమైన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది.

Read Also: ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

Related News

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

విడుదలకు ముందు టాటా సియెర్రా ఈవీ టీజర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోవడం పక్కా!

ఆంపియర్‌ కు బంపర్ డిమాండ్.. 3 లక్షల మార్క్ దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు!

క్రెటా, సెల్టోస్‌ కు కొత్త టెన్షన్.. దీపావళికి కొత్త హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది!

Big Stories

×