E-Paper

E20 పెట్రోల్‌ పై కొత్త వివాదం.. చీమల కథలో నిజమెంత?

E20 పెట్రోల్‌ పై కొత్త వివాదం.. చీమల కథలో నిజమెంత?
Advertisement

E20 Petrol Attract Ants: ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఓ కారు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ చుట్టూ పెద్ద సంఖ్యలో చీమలు కనిపించాయి. ఈ వీడియోను షేర్ చేసిన కొందరు, కారులో E20 పెట్రోల్ ఉండటమే చీమలు రావడానికి కారణమని రాసుకొచ్చారు. దీంతో చాలా మంది వాహనదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. నిజంగానే ఈ20 పెట్రోల్ చీమలను ఆకర్షిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

క్లారిటీ ఇచ్చిన BPCL

ఈ వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఫ్యూయల్ లో కలిపే ఇథనాల్ సాధారణ చక్కెర పదార్థం కాదు. ఇది ప్రత్యేక ప్రక్రియల ద్వారా తయారవుతుంది. ఇథనాల్ తయారీ సమయంలో కిణ్వ ప్రక్రియ, స్వేదనం లాంటి పలు దశలు ఉంటాయి. ఈ ప్రక్రియల తర్వాత అందులో ఉండే మిగిలిన చక్కెర పదార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. అందువల్ల ఇథనాల్‌ లో చీమలను ఆకర్షించే లక్షణాలు ఉండవని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇంధనంలో ఉపయోగించే ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్‌ లో కొన్ని ప్రత్యేక డీనాచురెంట్లు కూడా కలుపుతారు. ఇవి సాధారణంగా కీటకాలను ఆకర్షించవు. కొన్ని సందర్భాల్లో కీటకాలను దూరంగా ఉంచే లక్షణాలు కూడా కలిగి ఉంటాయని బీపీసీఎల్ తెలిపింది.

Advertisement

ఇథనాల్‌ ను పెట్రోల్‌ తో కలిపిన తర్వాత కూడా ఇంధనానికి సాధారణ పెట్రోల్ వాసనే ఉంటుంది. అలాగే సాధారణ పెట్రోల్‌ తో పోలిస్తే ఈ20 ఇంధనం తక్కువ ఆవిరిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. కాబట్టి, ఈ20 పెట్రోల్ కారణంగా చీమలు ఫ్యూయల్ క్యాప్ దగ్గరకు వస్తాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని బీపీసీఎల్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన చీమలు ఇతర కారణాల వల్ల అక్కడికి వచ్చి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాహనంపై పడిన ఆహార పదార్థాలు, తీపి పదార్థాల అవశేషాలు, ఇతర బయటి కారణాలు చీమలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే, దీనిని నేరుగా ఈ20 పెట్రోల్‌తో ముడిపెట్టడం సరైంది కాదని చెబుతున్నారు.

ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

ప్రస్తుతం భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, వ్యవసాయ రంగానికి సపోర్టు చేయడం లాంటి  లక్ష్యాలతో ఈ20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ20 పెట్రోల్‌ లో 20 శాతం ఇథనాల్, 80 శాతం సాధారణ పెట్రోల్ ఉంటుంది. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే  బయో ఫ్యూయల్. ఇది పర్యావరణానికి మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ20 పెట్రోల్ చీమలను ఆకర్షిస్తుందనే వాదనకు ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Read Also: 70/30 బ్రేక్ రూల్.. సేఫ్ రైడింగ్‌ కోసం ప్రతి బైక్ రైడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Related News

70/30 బ్రేక్ రూల్.. సేఫ్ రైడింగ్‌ కోసం ప్రతి బైక్ రైడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

ఓలా, ఉబెర్, ర్యాపిడోలో నెలకు అంత సంపాదింవచ్చా? ఇవిగో లెక్కలు!

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!

బెడ్‌లా మారే సీట్లు, 548 కిమీ రేంజ్.. ప్రభుదేవా కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే!

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

Big Stories

×