E-Paper
Advertisement

రోల్స్ రాయిస్‌ ను తలదన్నేలా BYD కొత్త లగ్జరీ కారు.. సింగిల్ ఛార్జ్ తో 1,000 కి.మీ రేంజ్!

రోల్స్ రాయిస్‌ ను తలదన్నేలా BYD కొత్త లగ్జరీ కారు.. సింగిల్ ఛార్జ్ తో 1,000 కి.మీ రేంజ్!
Advertisement

BYD Yangwang Atelier: లగ్జరీ కార్లంటే ముందుగా గుర్తొచ్చే పేరు రోల్స్ రాయిస్. అలాంటి కార్లకు పోటీ ఇచ్చేలా చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD సరికొత్త లగ్జరీ లిమోజిన్‌ను ఆవిష్కరించింది. తన అల్ట్రా లగ్జరీ బ్రాండ్ యాంగ్‌వాంగ్ (Yangwang) కింద ఆల్టియర్ (Atelier) పేరుతో ఈ కారును తీసుకొచ్చింది. అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో ఈ కారు తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. సూపర్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్లతో లగ్జరీ కార్ల మార్కెట్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

రోల్స్ రాయిస్‌ను గుర్తు చేసే డిజైన్

యాంగ్‌వాంగ్ ఆల్టియర్ పొడవు ఏకంగా 5,600 మి.మీ కాగా, వెడల్పు 2,030 మి.మీ., ఎత్తు 1,590 మి.మీ. వీల్‌బేస్ 3,500 మి.మీ గా ఉంది. దీని డిజైన్‌లో బ్రిటిష్ లగ్జరీ కార్ల శైలి కనిపించినప్పటికీ, ప్రాచీన చైనా సంస్కృతి నుంచి కూడా స్ఫూర్తి పొందారు. చైనాలో పాతకాలంలో ఉత్సవాల సమయంలో ఉపయోగించే కంచు పాత్ర ‘డింగ్’ ఆకారాన్ని ఆధారంగా చేసుకుని హెడ్‌లైట్లను రూపొందించారు. ఇందులో 12 ప్రత్యేక లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పెద్ద గ్రిల్, ప్రత్యేకమైన లోగో, కోచ్ డోర్లు, డ్యూయల్ టోన్ పెయింట్ ఈ కారుకు మరింత రాయల్ లుక్ ను తీసుకొచ్చాయి. 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే క్యాబిన్

Advertisement

ఈ కారు ఇంటీరియర్‌లో లగ్జరీకి పెద్దపీట వేశారు. నాలుగు సీట్లతో రూపొందించిన క్యాబిన్‌లో ప్రీమియం లెదర్, నేచురల్ వుడ్ ప్యానెల్స్, ఉన్నితో తయారు చేసిన ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. వెనుక సీట్లలో ప్రయాణించే వారికి ప్రత్యేకమైన జీరో గ్రావిటీ సీట్లు, పవర్డ్ లెగ్ రెస్ట్స్, మసాజ్ ఫంక్షన్ అందించారు. అంతేకాదు, 21.4 అంగుళాల ఓవర్‌ హెడ్ స్క్రీన్, 39 స్పీకర్ల డైనాడియో సౌండ్ సిస్టమ్, ముందు వెనుక రిఫ్రిజిరేటర్ కంపార్ట్‌ మెంట్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం డోర్లలో స్పెషల్ గొడుగులను కూడా ఏర్పాటు చేశారు. ఈ కారులో 532 లీటర్ల లగేజ్ స్పేస్ ఉండటం మరో విశేషం.

1,000 కి.మీకి పైగా రేంజ్..  

ఆల్టియర్‌ లో BYD సెకెండ్ జెనరేషన్ బ్లేడ్ LFP బ్యాటరీని ఉపయోగించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 100 kWh కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సింగిల్ ఛార్జ్ తో 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇవి 1,000 bhp కంటే ఎక్కువ పవర్ ను అందించే అవకాశం ఉంది. DiSus యాక్టివ్ సస్పెన్షన్, ట్యాంక్ టర్న్ ఫీచర్, టైర్ పంక్చర్ అయినప్పటికీ వెహికల్ ను కంట్రోల్ లో ఉంచే స్పెషల్ టెక్నాలజీని కలిగి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో నీటిపై తేలే సామర్థ్యం కూడా ఉందని BYD తెలిపింది.

భారత్‌లోకి వస్తుందా?

Advertisement

ప్రస్తుతం BYD తన యాంగ్‌వాంగ్ లగ్జరీ కార్లను భారత్‌లో అమ్మడం లేదు. గతంలో ఢిల్లీ మోటార్ షోలో U8 లగ్జరీ SUVని ప్రదర్శించింది. అయితే ,ఆల్టియర్ భారత మార్కెట్లోకి వస్తుందా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

Read Also: రేంజ్ 331 కిలో మీటర్లు.. ధర జస్ట్ 4.69 లక్షలే.. ఈ దీపావళి వేళ 4 చౌకైన ఈవీలు ఇవే!

Tags

Related News

జస్ట్ లక్షకే సోలార్ ఈవీ.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!

రేంజ్ 331 కిలో మీటర్లు.. ధర జస్ట్ 4.69 లక్షలే.. ఈ దీపావళి వేళ 4 చౌకైన ఈవీలు ఇవే!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 3XO CNG.. ఎంత స్కోర్ సాధించిందంటే?

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

Big Stories

Advertisement
×