Cheapest Electric Cars in India: దీపావళి పండుగ సందర్భంగా కొత్త కారు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తప్పించుకోవడం కోసం ఎలక్ట్రిక్ కారును తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, తక్కువ ధరలో కొన్ని EV కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) విధానం వల్ల తక్కువ ప్రారంభ ధరతోనే ఎలక్ట్రిక్ కారును ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంతకీ ఆ కార్లు ఏవంటే..
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి టాటా టియాగో EV ఒక మంచి ఆప్షన్. BaaS పథకం కింద దీని ప్రారంభ ధర రూ.4.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.2.60 చెల్లించాలి. ఈ కారులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 నుంచి 315 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
చిన్న కారును కోరుకునేవారికి ఎంజీ కామెట్ EV మరో ఆప్షన్. BaaS విధానంలో దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షలు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.2.50 నుంచి రూ.3.20 వరకు ఉంటుంది. రెండు 10.25 అంగుళాల స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. ఇందులో 17.3 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
SUV తరహా డిజైన్, ఎక్కువ ఫీచర్లు కోరుకునేవారికి టాటా పంచ్ EV ఉపయోగపడుతుంది. BaaS పథకంలో దీని ప్రారంభ ధర సుమారు రూ.6.59 లక్షలు. బ్యాటరీ వినియోగ ఛార్జీ కిలోమీటరుకు రూ.3.30గా ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 25 kWh, 35 kWh బ్యాటరీ ఆప్షన్లతో లభించే ఈ కారు వేరియంట్‌ను బట్టి 315 నుంచి 421 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
పెద్ద కారు, ప్రీమియం సౌకర్యాలు కోరుకునేవారికి ఎంజీ విండ్సర్ EV మంచి ఆప్షన్. BaaS విధానంలో దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.99 చెల్లించాలి. 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 135 డిగ్రీల వరకు వంగే వెనుక సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ఉన్నాయి. 38 kWh బ్యాటరీతో పనిచేసే ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
Read Also: దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!