E-Paper
Advertisement

జస్ట్ లక్షకే సోలార్ ఈవీ.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

జస్ట్ లక్షకే సోలార్ ఈవీ.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!
Advertisement

Gurugram Teen’s Innovation: సమస్యల నుంచే పరిష్కారం లభిస్తుంది. సమస్యే ఆవిష్కరణకు దారితీస్తుంది. అచ్చంగా ఇలాగే చేశాడు గురుగ్రామ్‌కు చెందిన 17 ఏళ్ల అక్షిత్ ఖేరా. తన ఇంట్లో పనిమనిషి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయాడు. తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసే వెహికల్ ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఏకంగా సోలార్ పవర్ తో నడిచే త్రీ వీలర్ ను తయారు చేశాడు. దీని తయారీకి అయిన ఖర్చు ఎంతో తెలుసా? కేవలం రూ.1,02,536.

పని మనిషి కుటుంబమే స్ఫూర్తి!

ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న అక్షిత్‌కు ఈ ఆలోచన తన ఇంట్లో పనిమనిషి కుటుంబంతో మాట్లాడినప్పుడు వచ్చింది. వాళ్లు సరుకు రవాణా చేయాలని భావించినప్పటికీ, అందుకు అవసరమైన ఎలక్ట్రిక్ లోడర్ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదు. సాధారణ ఎలక్ట్రిక్ లోడర్ ధర రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉండటంతో వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు ఉపయోగపడేలా, తక్కువ ధరలోనే ఈవీని తయారు చేయాలని అక్షిత్ నిర్ణయించుకున్నాడు. మరో 20 కుటుంబాలతో మాట్లాడిన తర్వాత ఇలాంటి వాహనాలకు మంచి డిమాండ్ ఉందని గుర్తించాడు.

రూ.1 లక్షతో సోలార్ త్రీ వీలర్ తయారీ

Advertisement

తొలుత పూర్తిగా సోలార్ పవర్ తో నడిచే వాహనాన్ని తయారు చేయాలనుకున్న అక్షిత్,  ఇంప్లిమెంటేషన్ లో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని సోలార్ సాయంతో పనిచేసే ఈవీని రూపొందించాడు. ఈ వెహికల్ లో ఇద్దరు కూర్చునేలా క్యాబిన్, 300 కిలోల సామర్థ్యం కలిగిన కార్గో బాక్స్ ఉన్నాయి. పైభాగంలో 400 వాట్ల మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది.  ఈ వెహికల్ కు అవసరమైన రోజువారీ విద్యుత్‌లో సగటున 63 శాతం సోలార్ ప్యానెల్ నుంచే లభిస్తుంది. దీంతో ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు కేవలం 13 పైసలు అవుతుంది.

ఎన్నో సవాళ్లు.. చివరకు సక్సెస్..

తొలుత ఈ వెహికల్ తయారీ ఖర్చు రూ.1.35 లక్షలకు చేరడంతో అక్షిత్ కొన్ని మార్పులు చేశాడు. బ్యాటరీ కెపాసిటీని 3.072 kWhకు తగ్గించాడు. అవసరం లేని చోట స్టీల్ వినియోగాన్ని తగ్గించి 26 కిలోల బరువును తగ్గించాడు. ఢిల్లీలోని మాయాపురి మార్కెట్‌లో విడిభాగాల ధరలను బేరమాడి కొనుగోలు చేశాడు. మొత్తంగా ఫైనల్ వెహికల్ తయారీ ఖర్చును రూ.1,02,536కు తీసుకొచ్చాడు.

Advertisement

అయితే, ఈ వెహికల్ తయారీ అంత ఈజీగా సాగలేదు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లోని పలు వర్క్‌ షాప్‌లు అతడి ప్రాజెక్టుకు ఒప్పుకోలేదు. చివరకు అరుణ్ అనే ఫ్యాబ్రికేటర్ సహకారంతో వాహన ఛాసిస్‌ను తయారు చేశాడు. సోలార్ ప్యానెల్‌కు సంబంధించిన విద్యుత్ సమస్యలు, వర్షాకాలంలో నీరు చేరకుండా కార్గో బాక్స్‌ ను రూపొందించడం లాంటి సవాళ్లను కూడా అధిగమించాడు.

మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా..

ప్రస్తుతం ఈ వాహనం ప్రోటోటైప్ లో ఉంది. పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి వెహికల్ ను ఒక పేద కుటుంబానికి ఉచితంగా అందించాలని అక్షిత్ భావిస్తున్నాడు. అలాగే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నాడు. భారీ స్థాయిలో తయారీ ప్రారంభిస్తే ఖర్చును మరో 10 నుంచి 20 శాతం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నాడు. భవిష్యత్తులో రిమూవబుల్ బ్యాటరీలు, మెరుగైన సోలార్ సెల్స్ లాంటి సాంకేతికతలను కూడా ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు. చిన్న వయసులోనే సమాజంలోని ఓ సమస్యను గుర్తించి, తన పరిజ్ఞానంతో పరిష్కారం చూపించిన అక్షిత్ ప్రయత్నం నిజంగా అభినందనీయం.

Read Also: రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!

Tags

Related News

రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!

రేంజ్ 331 కిలో మీటర్లు.. ధర జస్ట్ 4.69 లక్షలే.. ఈ దీపావళి వేళ 4 చౌకైన ఈవీలు ఇవే!

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 3XO CNG.. ఎంత స్కోర్ సాధించిందంటే?

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

Big Stories

Advertisement
×