E-Paper
Advertisement

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!
Advertisement

Diwali Car Discounts 2026: పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి పలు ఆటోమొబైల్ కంపెనీలు మంచి ఆఫర్లు ప్రకటించాయి. టాటా మోటార్స్, హోండా, మారుతి సుజుకి, హ్యుందాయ్, స్కోడా సంస్థలు తమ కార్లు, SUVలపై భారీ తగ్గింపులు అందిస్తున్నాయి. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్స్ ప్రకటించాయి. దీపావళి సందర్భంగా అందుబాటులో ఉన్న టాప్ 5 డీల్స్ గురించి తెలుసుకుందాం.

1.టాటా హారియర్ EV.. రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్స్

దీపావళి వేళ అత్యధిక తగ్గింపు టాటా హారియర్ EVపై లభిస్తున్నాయి. దీని ఫియర్‌ లెస్+, ఎంపవర్డ్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఇందులో రూ.1 లక్ష వరకు స్పెషల్ ఆఫర్, రూ.75,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.1 లక్ష వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. అయితే, ఎంపవర్డ్ AWD స్టెల్త్ 75 ACFC వేరియంట్‌పై మొత్తం బెనిఫిట్స్ రూ.2.25 లక్షల వరకు ఉన్నాయి. ఈ వేరియంట్ 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్‌ తో వస్తుంది. హారియర్ EV ధరలు రూ.21.79 లక్షల నుంచి రూ.29.79 లక్షల వరకు ఉన్నాయి.

2.హోండా సిటీ.. రూ.1.86 లక్షల వరకు తగ్గింపు

Advertisement

సెడాన్ కొనాలనుకునే వారికి హోండా సిటీ మంచి ఆప్షన్ కానుంది. ఈ కారుపై రూ.1.86 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ ను బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. కొన్ని కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. హోండా సిటీ పెట్రోల్ ధరలు రూ.12.08 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. హైబ్రిడ్ వెర్షన్ ధర రూ.21.44 లక్షలు.

3.మారుతి విక్టోరిస్.. రూ.1.41 లక్షల వరకు ఆఫర్   

మారుతి సుజుకి విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ.1.41 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, దీపావళి బుకింగ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ ఉన్నాయి. నవంబర్ 11 వరకు బుకింగ్ చేసుకునేవారికి రూ.11,000 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. పాత కారును స్క్రాప్ చేసే వారికి రూ.45,000 వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. పెట్రోల్, CNG వేరియంట్లపై కూడా వరుసగా రూ.1.51 లక్షలు, రూ.80,100 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. విక్టోరిస్ ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి.

4.హ్యుందాయ్ క్రెటా.. రూ.1.10 లక్షల వరకు ఆఫర్లు

Advertisement

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్లపై రూ.1.10 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. వీటిలో క్యాష్ డిస్కౌంట్, దీపావళి బోనస్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్, అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి. పెట్రోల్ CVT వేరియంట్లపై రూ.1.05 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. బేస్ E పెట్రోల్ వేరియంట్‌పై రూ.95,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. డీజిల్ వేరియంట్లకు మాత్రం రూ.5,000 స్క్రాపేజ్ బోనస్ మాత్రమే అందుబాటులో ఉంది. క్రెటా ధరలు రూ.10.91 లక్షల నుంచి రూ.20.14 లక్షల వరకు ఉన్నాయి.

5.స్కోడా కైలాక్.. రూ.70,000 వరకు బెనిఫిట్స్

స్కోడా కైలాక్ కొనుగోలుపై రూ.70,000 వరకు దీపావళి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో వేరియంట్‌ను బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన వేరియంట్లపై లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కైలాక్ ధరలు రూ.7.59 లక్షల నుంచి రూ.13.09 లక్షల వరకు ఉన్నాయి.

Read Also: మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

Tags

Related News

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

Big Stories

Advertisement
×