E-Paper
Advertisement

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..
Advertisement

Tesla Cybertruck Discontinued: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన సైబర్‌ ట్రక్ ప్రయాణం త్వరలో ముగియనుంది. అనుకున్న స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో 2027లో ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు, కంపెనీ తన భవిష్యత్తు ప్రాజెక్టు అయిన సైబర్‌ క్యాబ్ ఉత్పత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోంది.

భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ ట్రక్

టెస్లా సైబర్‌ ట్రక్‌ను తొలిసారిగా 2019లో కాన్సెప్ట్ మోడల్‌గా పరిచయం చేసింది. మొదట 2021లోనే మార్కెట్లోకి తీసుకురావాలని భావించినప్పటికీ, పలు కారణాలతో విడుదల ఆలస్యమైంది. చివరకు 2023లో అమెరికాలోని టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో దీని ఉత్పత్తిని ప్రారంభించి, అమ్మకాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

డిఫరెంట్ డిజైన్, స్టెయిన్‌ లెస్ స్టీల్ బాడీతో సైబర్‌ ట్రక్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఫోర్డ్ F-150 లైట్నింగ్ లాంటి ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కులకు గట్టి పోటీ ఇవ్వాలని టెస్లా దీనిని తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెరికా, మెక్సికో, కెనడా, యూఏఈ, ఖతార్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా లాంటి మార్కెట్లలో విక్రయిస్తోంది.

అమ్మకాలు తగ్గడానికి కారణాలేంటి?

సైబర్‌ట్రక్ ప్రారంభంలో మంచి ప్రచారం పొందినప్పటికీ, ఆ తర్వాత అమ్మకాలు ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. దీనికి ప్రధాన కారణం దాని విభిన్నమైన డిజైన్ అని చెప్పవచ్చు. షార్ప్ అంచులతో కూడిన స్టెయిన్‌ లెస్ స్టీల్ బాడీ కొంతమందిని ఆకట్టుకున్నా, మరికొందరికి నచ్చలేదు. అంతేకాకుండా, యూరప్‌లో అమల్లో ఉన్న భద్రతా నిబంధనలకు దీని డిజైన్ సరిపోకపోవడంతో అక్కడి మార్కెట్లో అమ్మకాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు, 2019లో పరిచయం చేసిన సమయంలో ప్రకటించిన ధరలతో పోలిస్తే, వాస్తవ మార్కెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి తగ్గింది. ఎలాన్ మస్క్‌ కు సంబంధించిన వివాదాలు కూడా బ్రాండ్‌పై ప్రభావం చూపిన అంశాల్లో ఒకటిగా మారాయి.

అంచనాలను అందుకోలేకపోయిన అమ్మకాలు

Advertisement

సైబర్‌ ట్రక్ విషయంలో టెస్లా భారీ లక్ష్యాలను పెట్టుకుంది. ఏటా 2.5 లక్షల యూనిట్లను విక్రయించాలనేది ఎలాన్ మస్క్ ప్రారంభ అంచనా. అయితే, ఇప్పటివరకు ఈ ట్రక్ మొత్తం అమ్మకాలు సుమారు 63,000 యూనిట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ ఆశించిన లక్ష్యానికి, వాస్తవ అమ్మకాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

సైబర్‌ క్యాబ్ కోసం కొత్త ప్రణాళిక

సైబర్‌ ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక మరో ముఖ్యమైన కారణం సైబర్‌క్యాబ్. భవిష్యత్తులో పూర్తిస్థాయి ఆటోమేటిక్ ప్రయాణ సేవలపై టెస్లా ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సైబర్‌ క్యాబ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రస్తుత తయారీ వనరులను ఉపయోగించుకోవాలని చూస్తోంది. మొత్తంగా, ఎన్నో అంచనాలు, భారీ ప్రచారంతో మార్కెట్లోకి వచ్చిన సైబర్‌ ట్రక్‌ కు మూడేళ్లకే ముగింపు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

Tags

Related News

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

Big Stories

Advertisement
×