E-Paper
Advertisement

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?
Advertisement

Hero Xtreme 125R Stealth Edition: ప్రముఖ టూ వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టెల్త్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కొత్త టాప్ ఎండ్ వేరియంట్ ధరను రూ.1.16 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కొత్త కలర్ స్కీమ్‌ తో పాటు అధునాతన ఫీచర్లను ఇందులో అందించింది. ముఖ్యంగా కలర్ TFT డిస్‌ ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

కొత్త లుక్‌ లో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్‌ను స్పెషల్ బ్రాంజ్, బ్లాక్ కలర్ మిక్సింగ్ తో రూపొందించారు. దీనికి అడిషనల్ గా రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. వెనుక గ్రాబ్ రైల్స్, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్‌ టెన్షన్ ప్యానెల్స్‌ తో పాటు బైక్‌ మీద ఉన్న ఎక్స్‌ ట్రీమ్ బ్యాడ్జింగ్‌లోని ‘X’ లెటర్ కు కూడా రెడ్ కలర్ హైలైట్స్ ఇచ్చారు. ఈ మార్పులు బైక్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి.

4.2 అంగుళాల TFT డిస్‌ ప్లే.. సూపర్ ఫీచర్లు..

Advertisement

ఈ కొత్త వేరియంట్‌ లో 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ ప్లేను అందించారు. ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ శ్రేణిలో ఈ ఫీచర్ పొందిన ఏకైక వేరియంట్ ఇదే. హీరో స్పెషల్ యాప్ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ ను బైక్ డిస్‌ ప్లేతో కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్స్, SMS అలర్ట్స్‌ తో పాటు మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. మరో ముఖ్యమైన ఫీచర్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS). టైర్లలో గాలి ఎంత ఉందని గమనించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ సెగ్మెంట్‌ లోనే తొలిసారిగా ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు హీరో వెల్లడించింది.

మూడు రైడింగ్ మోడ్‌లు

స్టెల్త్ ఎడిషన్‌లో రెయిన్, రోడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీటితో రైడర్లు తమ అవసరానికి అనుగుణంగా బైక్ పనితీరును సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇందులో అందుబాటులో ఉంది. క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

ఇంజిన్‌ లో నో ఛేంజెస్

Advertisement

ఈ కొత్త ఎడిషన్‌లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 124.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 11.4 హెచ్‌పీ పవర్, 10.5 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు.

వేరియంట్ల వారీగా ధరలుఎలా ఉన్నాయంటే?

స్టెల్త్ ఎడిషన్‌తో కలిపి హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

1.CBS వేరియంట్ – రూ.91,500

2.ABS వేరియంట్ – రూ.96,700

3.ABS సింగిల్ సీట్ – రూ.96,700

4.డ్యూయల్ ఛానల్ ABS – రూ.1.10 లక్షలు

5.స్టెల్త్ ఎడిషన్ – రూ.1.16 లక్షలు

డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్‌తో పోలిస్తే స్టెల్త్ ఎడిషన్ ధర రూ.6,000 ఎక్కువ. అదనపు ధరకు ప్రత్యేకమైన రంగులు, TFT డిస్‌ప్లే, TPMS వంటి ఫీచర్లు లభిస్తాయి. మార్కెట్లో ఈ బైక్‌ TVS రైడర్, హోండా CB125 హార్నెట్ తో పోటీ పడనుంది.

Read Also: బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

Tags

Related News

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది.. కొత్త ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

Advertisement
×