Tata EV offers November 2026: ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి టాటా మోటార్స్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. నవంబర్ 2026 నెలకు సంబంధించి ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపులు, స్పెషల్ బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా టాటా కర్వ్ EVపై ఏకంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. హారియర్ EV, పంచ్ EV, టియాగో EV లాంటి మోడళ్లపైనా సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సియెర్రా EV మినహా మిగతా టాటా ఎలక్ట్రిక్ కార్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ బెనిఫిట్స్ నవంబర్ 15, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ నెలలో ఎక్కువ ఆఫర్లు టాటా కర్వ్ EV మీద లభిస్తున్నాయి. ప్రీ ఫేస్‌లిఫ్ట్ నాన్ ఎక్స్ సిరీస్ మోడళ్లపై రూ.3 లక్షల వరకు గ్రీన్ బోనస్, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ అందిస్తున్నారు. కొత్త ఎక్స్ సిరీస్ మోడళ్లపై రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.30,000 లాయల్టీ ఆఫర్ ఉంది. కర్వ్ EV ధరలు రూ.17.19 లక్షల నుంచి రూ.19.39 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 55kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
టాటా ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ SUV హారియర్ EV ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.1 లక్ష వరకు ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.75,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్, రూ.1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కారు 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. సింగిల్ ఛార్జ్ తో గరిష్ఠంగా 627 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ధరలు రూ.21.79 లక్షల నుంచి రూ.29.29 లక్షల వరకు ఉన్నాయి.
టాటా పంచ్ EV ప్రీ ఫేస్‌లిఫ్ట్ స్టాక్‌పై రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. ఇందులో రూ.1.10 లక్షల వరకు గ్రీన్ బోనస్, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్ ఉన్నాయి. దీని బ్యాటరీ ఆప్షన్లు 25kWh, 35kWh కాగా, క్లెయిమ్ రేంజ్ 365 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
టియాగో EV పాత వెర్షన్లపై కూడా రూ.1.45 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. రూ.1 లక్ష వరకు గ్రీన్ బోనస్, రూ.50,000 వరకు ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. దీని రేంజ్ 293 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
టాటా నెక్సాన్ EV అన్ని వేరియంట్లపై రూ.45,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. ఇందులో రూ.10,000 గ్రీన్ బోనస్, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్ ఉన్నాయి. 30kWh, 45kWh బ్యాటరీ ఆప్షన్లతో లభించే ఈ కారు గరిష్ఠంగా 489 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్లు సిటీని బట్టి, డీలర్‌షిప్ దగ్గర ఉన్న స్టాక్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసే ముందు టాటా డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.
Read Also: మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?