E-Paper
Advertisement

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. ఇప్పుడు ఎంత అంటే?

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. ఇప్పుడు ఎంత అంటే?
Advertisement

CNG Price Hike: CNG వాహనదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. ముంబై మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్‌జీ (CNG) ధరలను మరోసారి పెంచింది. తాజాగా కిలోకు రూ.1.50 పెంచడంతో ముంబైలో సీఎన్‌జీ ధర రూ.91.50కి చేరింది. ఈ పెంపు ముంబైతో పాటు థానే, నవీ ముంబై, మీరా-భయందర్, కళ్యాణ్, డోంబివిలి సహా పలు ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. 2026లో MGL సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.

జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.11 పెంపు

2026 జనవరి 1న ముంబైలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.50గా ఉంది. అప్పటి నుంచి పలుమార్లు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 1న కిలోకు 50 పైసలు, ఏప్రిల్ 12న రూ.1, మే 13న రూ.2, మే 29న మరో రూ.2 పెంచారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న రూ.2, అక్టోబర్ 1న రూ.1, నవంబర్ 1న మరో రూ.1 పెరిగింది. తాజాగా నవంబర్ 15న కిలోకు రూ.1.50 పెంచడంతో ధర రూ.91.50కు చేరింది. అంటే ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇప్పటివరకు కిలో సీఎన్‌జీపై రూ.11 అదనపు భారం పడింది.

ప్రాంతాల వారీగా కొత్త ధరలు ఇవే..

Advertisement

MGL పంపుల దగ్గర ప్రాంతాలను బట్టి సీఎన్‌జీ ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. ముంబై, గ్రేటర్ ముంబై ప్రాంతాల్లో కిలో ధర రూ.91.50గా ఉంది. థానే, నవీ ముంబై, మీరా-భయందర్, కళ్యాణ్, డోంబివిలి, ఉల్హాస్‌నగర్, భివండి, అంబర్‌నాథ్, బద్లాపూర్ ప్రాంతాల్లోనూ ఇదే ధర అమలవుతోంది. అయితే, రాయగఢ్ జిల్లాలో మాత్రం కిలో సీఎన్‌జీ ధర రూ.93.50గా ఉంది. పన్వేల్, ఖార్ఘర్, తలోజా, ఉరాన్, అలీబాగ్, పెన్, కర్జాత్, ఖలాపూర్, రోహా, మహాద్ లాంటి ప్రాంతాల్లో ఈ ధర వర్తిస్తుంది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో నో ఛేంజ్..   

మరోవైపు ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం కొంతకాలంగా స్టేబుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా ఉండగా, డీజిల్ ధర రూ.97.83గా ఉంది. 2026 మే 25 తర్వాత వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.  సీఎన్‌జీ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, సీఎన్‌జీ కార్లు వినియోగించే వారిపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం సీఎన్‌జీ వాహనాలపై ఆధారపడేవారు ఈ ధరల పెంపుతో వారి  నెలవారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: కారు కీని గుర్తించడం లేదా? బ్యాటరీ అయిపోయినా ఇలా స్టార్ట్ చేయొచ్చు!

Tags

Related News

కారు కీని గుర్తించడం లేదా? బ్యాటరీ అయిపోయినా ఇలా స్టార్ట్ చేయొచ్చు!

LFP vs NMC బ్యాటరీలు.. ఇండియన్ ఈవీలకు ఏది బెస్ట్? అసలు తేడాలు ఇవే!

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!

కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

తక్కువ ధర.. ఎక్కువ రేంజ్.. భారత్‌లో బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

లాంగ్ డ్రైవ్‌ల కోసం బెస్ట్ 5 డీజిల్ SUVలు.. వీటి పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు!

Big Stories

Advertisement
×