E-Paper
Advertisement

బ్యాట్ల‌ల్లో స్ప్రింగులు పెట్టి టీమిండియా గెలిచింది…ర‌మీజ్ రాజా ఆరోప‌ణ‌లు!

బ్యాట్ల‌ల్లో స్ప్రింగులు పెట్టి టీమిండియా గెలిచింది…ర‌మీజ్ రాజా ఆరోప‌ణ‌లు!
Advertisement

Ramiz Raja On Team India U19: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Under-19 Asia Cup 2026 tournament) విజేతగా టీమిండియా నిలిచింది. శనివారం రోజున జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసి… 9వ సారి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. అయితే ఈ విజయం నేపథ్యంలో భారత కుర్రాళ్ళు చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై ఇప్పటికి కూడా చర్చ నడుస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో టీమిండియా విజయంపై పాకిస్తాన్ మాజీలు విషం కక్కుతున్నారు. తన్వీర్ అహ్మద్, షాహిద్ అఫ్రిది లాంటి వాళ్లు ఇండియా విజయాన్ని జీర్ణించుకోలేక ఫిక్సింగ్ చేసి గెలిచారని ఆరోపించారు.

బ్యాట్ల‌ల్లో స్ప్రింగులు పెట్టి టీమిండియా గెలిచింది…ర‌మీజ్ రాజా ఆరోప‌ణ‌లు!

లేటెస్ట్ గా రమీజ్ రాజా కూడా అలాంటి వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెర లేపాడు. మోసం చేయకుండా పాకిస్తాన్ జట్టుపై టీమిండియా గెలిచిన దాఖలాలు లేవని బాంబు పేల్చాడు. బ్యాట్ల‌లో స్ప్రింగులు పెట్టి చీట్ చేసిన టీమిండియా, పాకిస్తాన్ జట్టును ఫైనల్స్ లో ఓడించిందని ఆరోపించాడు. అంతేకానీ టీమిండియా సొంత టాలెంట్ తో గెలవలేదు అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

చీటింగ్ చేయ‌కుండా పాక్ పై టీమిండియా గెల్వ‌లేదు!

అండర్ 19 ఆసియా కప్ (Under-19 Asia Cup 2026 tournament) విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు, కామెంటేట‌ర్ రమీజ్ రాజా (Ramiz Raja) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ అండర్ 19 జట్టును (pak U 19) మోసం చేసి టీమ్ ఇండియా ఛాంపియన్ అయిందని ఆరోపించాడు. చేజింగ్ చేస్తున్న క్రమంలో 252 పరుగులు చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడిందని వెల్లడించాడు. అలాంటి సమయంలో 338 పరుగుల లక్ష్యాన్ని చేదించడం అసాధ్యమని పేర్కొన్నాడు. కానీ పదో స్థానంలో వచ్చిన ఆటగాళ్లు కూడా రాణించి పాకిస్తాన్ ను ఓడించడం అనుమానంగా ఉందని రమీజ్ రాజా బాంబు పేల్చాడు.

Advertisement

కచ్చితంగా చివరిలో వచ్చిన టీమిండియా (Team India) ప్లేయ‌ర్లు తమ బ్యాట్లల్లో స్ప్రింగులు (Bat springs) వినియోగించారని ఆరోపించాడు. బ్యాట్లలో స్ప్రింగులు ఉంటేనే అలాంటి టార్గెట్ సులభంగా చేదిస్తారని పేర్కొన్నాడు. ఏదో తప్పు జరిగిందని తనకు ముందే సమాచారం అందిందని.. విక్టరీ తర్వాత దీనిపై తాను విచారణ చేపట్టినట్టు పేర్కొన్నాడు. ఇందులో స్ప్రింగులు వాడినట్టు తనకు తెలిసిందన్నాడు. దీనిపై వెంటనే అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లికి లేఖ రాస్తానని వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా జట్టు పై విచారణ చేయిస్తానని రమీజ్ రాజా వెల్లడించాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

అండ‌ర్ 19 పాకిస్తాన్ కుర్రాళ్ల బ‌ర్త్ సర్టిఫికెట్లు చెక్ చేయాలి…దినేష్ కార్తీక్ సంచ‌ల‌నం

ధోనికి రూ.4 కోట్లు దండగా, అత‌న్ని వెంట‌నే వ‌దిలించుకోండి..అశ్విన్ సంచ‌ల‌నం

ఆసియా క‌ప్ హీరో ఆర్య‌వీర్ క‌న్నీటిగాథ‌..రెండేళ్లుగా విడిగా ఉంటున్న త‌ల్లిదండ్రులు!

బిగ్‌బాష్ లీగ్‌లో పెను ప్రమాదం..కుప్పకూలిన మహిళా అంపైర్

ఆటోగ్రాఫ్‌లు పక్కకు పెట్టి, నా కొడుకును ఎత్తుకోవోయ్..యష్ ఠాకూర్‌ను ఆడుకున్న అభిమాని

ఛాలెంజ్ ఓడి గుండు గీయించుకున్న పాక్ ఫ్యాన్..టీమిండియాతో పెట్టుకుంటే అంతేగా, దూలతీరిపోద్ది

జాతీయ‌ జెండా అవ‌మానం? మ‌హ్మ‌ద్ సిరాజ్ చేసిన ప‌నికి సెల్యూట్ చేయాల్సిందే

Big Stories

Advertisement
×