E-Paper
Advertisement

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!
Advertisement

Foggy Weather Driving Tips: శీతాకాలం వచ్చిందంటే ఉదయం వేళ రోడ్లపై పొగమంచు ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే వాహనదారులకు చాలా ఇబ్బందికంగా ఉంటుంది. కొద్ది దూరంలో ఉన్న వాహనాలు కూడా సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో హై బీమ్‌లు, హజార్డ్ లైట్లు ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. పొగమంచులో సేఫ్ డ్రైవింగ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

హజార్డ్ లైట్లు ఆన్ చేసి డ్రైవింగ్ చేయకండి!

పొగమంచులో ఇతరులకు మన కారు కనిపించాలనే ఉద్దేశంతో చాలామంది హజార్డ్ లైట్లు ఆన్ చేస్తుంటారు. కానీ, కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. అలా చేస్తే ఇతర డ్రైవర్లకు మీ కారు కదులుతోందా? ఆగి ఉందా? అనే విషయం అర్థం కాకపోవచ్చు. అంతేకాదు, మీరు మలుపు తిరిగేటప్పుడు ఇండికేటర్ సిగ్నల్స్ కూడా సరిగ్గా కనిపించకపోవచ్చు. వాహనం చెడిపోయినప్పుడు, పక్కకు ఆపినప్పుడు మాత్రమే హజార్డ్ లైట్లు ఉపయోగించాలి.

హై బీమ్ వద్దు.. లో బీమ్ ముద్దు!

Advertisement

పొగమంచులో హై బీమ్ లైట్లు వేస్తే రోడ్డు మరింత స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటారు. కానీ, వాటి లైట్ పొగమంచులోని నీటి బిందువులపై రిఫ్లెక్ట్ అయి కళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో ఎదురుగా ఉన్న రోడ్డు కనిపించడం మరింత కష్టమవుతుంది. అందుకే లో బీమ్ హెడ్‌ లైట్లను ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి ముందు ఫాగ్ ల్యాంప్‌లు ఆన్ చేయవచ్చు. దట్టమైన పొగమంచులో వెనుక ఫాగ్ ల్యాంప్‌లు ఉపయోగించి, విజుబులిటీ మెరుగుపడిన వెంటనే వాటిని ఆఫ్ చేయాలి.

విండ్‌ స్క్రీన్‌పై పొగమంచు పట్టకుండా ఇలా చేయండి!

చలికాలంలో కారు లోపలి భాగంలో తేమ పేరుకుపోవడంతో విండ్‌స్క్రీన్‌పై పొగమంచు ఏర్పడుతుంది. దీనివల్ల డ్రైవర్‌కు రోడ్డు సరిగ్గా కనిపించదు. ఈ సమస్యను తగ్గించడానికి ఫ్రంట్ డిఫాగర్‌ ను ఆన్ చేయాలి. ఏసీని కూడా ఉపయోగిస్తే క్యాబిన్‌ లోని తేమ తగ్గి గ్లాస్ ఈజీగా క్లియర్ అవుతుంది. రీసర్క్యులేషన్‌కు బదులుగా ఫ్రెష్ ఎయిర్ మోడ్ ఉపయోగించడం మంచిది. అలాగే గ్లాస్ లోపలి, బయటి భాగాలను శుభ్రంగా ఉంచాలి.

పొగమంచులో ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement

⦿ వేగం తగ్గించండి: రోడ్డు స్పష్టంగా కనిపించనప్పుడు నెమ్మదిగా వెళ్లాలి.

⦿ దూరం పెంచండి: ముందు వాహనానికి కనీసం నాలుగు సెకన్ల దూరం పాటిస్తూ, పొగమంచు ఎక్కువైతే మరింత దూరం ఉంచాలి.

⦿ రోడ్ సిగ్నల్స్ గమనించండి: లేన్‌లో ఉండేందుకు రోడ్డు అంచున ఉన్న లేన్స్ ను ఫాలో కావాలి.

⦿ ఎమర్జెన్సీ బ్రేకులు వేయకండి: అనవసర ఓవర్‌ టేకింగ్, వేగంగా లేన్ మార్చడం మానుకోండి.

⦿ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయండి: పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని మీరే కంట్రోల్ చేయండి.

Read Also: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Tags

Related News

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!

కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

తక్కువ ధర.. ఎక్కువ రేంజ్.. భారత్‌లో బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

లాంగ్ డ్రైవ్‌ల కోసం బెస్ట్ 5 డీజిల్ SUVలు.. వీటి పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు!

మారుతి బ్రెజ్జా టర్బో 1,200 కి.మీ. రివ్యూ.. మైలేజ్ ఎంత? పనితీరు ఎలా ఉందంటే?

హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!

కొత్త ఇన్నోవా టీజర్ విడుదల.. హైక్రాస్ లుక్ కంప్లీట్ గా మారిపోనుందా?

Big Stories

Advertisement
×