Maruti Suzuki Offers: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మారుతి సుజుకి నవంబర్ నెలకు సంబంధించి సూపర్ ఆఫర్లు ప్రకటించింది. నెక్సా డీలర్‌షిప్ లలో అమ్మే పలు కార్లపై సూపర్ బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా గ్రాండ్ విటారాపై గరిష్ఠంగా రూ.1.36 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇన్విక్టో, XL6 లాంటి ఎమ్‌పీవీలపై కూడా రూ.50 వేలకుపైగా ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.
మారుతి సుజుకి అందిస్తున్న ఆఫర్లలో గ్రాండ్ విటారా మొదటి స్థానంలో ఉంది. దీని పెట్రోల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.36 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. పెట్రోల్ AWD వేరియంట్లపై రూ.1.15 లక్షల వరకు ఆఫర్లతో పాటు మరో ఐదేళ్ల పాటు వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ.1.20 లక్షల వరకు ప్రయోజనాలు, ఐదేళ్ల వారంటీతో పాటు కొన్ని ప్రాంతాల్లో రోడ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. CNG వేరియంట్లపై రూ.1 లక్ష వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. గ్రాండ్ విటారా ధరలు రూ.10.77 లక్షల నుంచి రూ.19.62 లక్షల వరకు ఉన్నాయి.
మారుతి ఫ్లాగ్‌షిప్ ఎమ్‌పీవీ ఇన్విక్టోపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారుపై గరిష్ఠంగా రూ.95,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో ఎక్స్ఛేంజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. అయితే, ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. ఇన్విక్టో ధర రూ.25.02 లక్షల నుంచి రూ.28.71 లక్షల వరకు ఉంది.
ఆరు సీట్ల ఎమ్‌పీవీ XL6 పెట్రోల్ వేరియంట్లపై రూ.61,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. CNG మోడళ్లపై రూ.50,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. దీని ధరలు రూ.11.62 లక్షల నుంచి రూ.14.52 లక్షల వరకు ఉన్నాయి. మరోవైపు, ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ జిమ్నీపై రూ.35,000 వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనిపై స్పెషల్ ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ లేవు. జిమ్నీ ధర రూ.12.59 లక్షల నుంచి రూ.14.52 లక్షల వరకు ఉంది.
మారుతి ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్లపై రూ.27,100 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ పెట్రోల్ మోడళ్లపై రూ.22,100 వరకు, CNG వేరియంట్లపై రూ.15,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. దీని ధర రూ.6.90 లక్షల నుంచి రూ.11.89 లక్షల వరకు ఉంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారాపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు హోమ్ ఛార్జర్ ఉచిత ఇన్‌స్టాలేషన్ అందిస్తోంది. దీని ధర రూ.16.19 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంది. ఇక మారుతి బాలెనోపై నవంబర్ నెలలో ఎలాంటి అధికారిక ఆఫర్లు ప్రకటించలేదు. గ్రాండ్ విటారా కొనాలనుకునే వారికి ఈ నెలలో ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
Read Also: ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది.. కొత్త ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!