E-Paper
Advertisement

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!
Advertisement

Bajaj Chetak Sales: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో బజాజ్ చేతక్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్ మొత్తం అమ్మకాలు 10 లక్షల యూనిట్ల మైలురాయిని దాటాయి. దేశంలో ఈ ఘనత సాధించిన మూడో ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థగా బజాజ్ ఆటో గుర్తింపు పొందింది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీల తర్వాత ఈ రికార్డును అందుకున్న సంస్థగా పేరు సంపాదించింది. 2026లో చేతక్‌కు లభిస్తున్న వినియోగదారుల ఆదరణ చూస్తుంటే, రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2026లో చేతక్‌కు భారీ డిమాండ్

2020 జనవరిలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన బజాజ్ చేతక్, ప్రారంభంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించలేకపోయింది. అయితే, నెమ్మదిగా మార్కెట్లో ఆదరణ పెరగడంతో అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా 2024 నుంచి చేతక్ ప్రయాణం పూర్తిగా మారిపోయింది. 2026 నవంబర్ 6 నాటికి దేశీయ మార్కెట్లో చేతక్ రిటైల్ అమ్మకాలు 10,01,135 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో ఈ ఒక్క ఏడాదిలోనే 4,12,409 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 73 శాతం వృద్ధి నమోదయ్యింది.

ఏడాదికేడాది పెరుగుతున్న అమ్మకాలు

Advertisement

చేతక్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే దాని అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. 2020లో కేవలం 1,243 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2021లో ఈ సంఖ్య 4,765కు చేరింది. 2022లో 26,758 యూనిట్లు, 2023లో 75,112 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, 2024లో చేతక్ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ ఏడాది 2,01,167 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2025లో మరో 39 శాతం వృద్ధితో 2,79,691 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక 2026లో ఇప్పటికే 4 లక్షల మార్కును దాటడం కంపెనీకి పెద్ద విజయంగా చెప్పవచ్చు.

ఐదేళ్లలో ఐదు రెట్లకు పైగా మార్కెట్ వాటా

అమ్మకాల పెరుగుదలతో పాటు ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో చేతక్ వాటా కూడా భారీగా పెరిగింది. 2022లో కేవలం 4 శాతంగా ఉన్న మార్కెట్ వాటా, 2024లో 17 శాతానికి చేరింది. 2025లో 21 శాతంగా నమోదైంది. ఇక 2026 నవంబర్ 6 నాటికి ఇది 22.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల పరంగా టీవీఎస్ మోటార్ కంపెనీ 26 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, బజాజ్ చేతక్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

5 లక్షల అమ్మకాల మార్కుపై బజాజ్ కన్ను

Advertisement

2026లో చేతక్ అమ్మకాలు ప్రతి త్రైమాసికంలోనూ మంచి రిజల్ట్స్ సాధించింది. జనవరి-మార్చి మధ్య 1,00,615 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్-జూన్‌లో 1,17,679 యూనిట్లు అమ్మింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 1,36,040కు చేరింది. అక్టోబర్ నెలలోనే రికార్డు స్థాయిలో 49,170 యూనిట్లు అమ్ముడయ్యాయి. బజాజ్ చేతక్‌కు ఇప్పటివరకు ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాలు. పండుగ సీజన్‌లో డిమాండ్ మరింత పెరిగితే నవంబర్‌లో 50 వేల యూనిట్ల అమ్మకాల మార్కును కూడా దాటే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవాలంటే బజాజ్ మరో 87,591 యూనిట్లను అమ్మాల్సి ఉంటుంది.

Read Also: సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

Tags

Related News

సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది.. కొత్త ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!

విన్‌ఫాస్ట్ MPV 7 ధర భారీగా తగ్గింపు.. ఏకంగా రూ.4.10 లక్షలు కట్..

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్.. లుక్ అదిరింది గురూ!

జీప్ ఎస్‌యూవీలపై దీపావళి ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.65 లక్షల డిస్కౌంట్!

నిస్సాన్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఫ్రీ CNG కిట్‌తో పాటు గోల్డ్ కాయిన్ కూడా!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో విడా సరికొత్త ప్రయోగాలు.. ఒకేసారి మూడు కాన్సెప్ట్స్‌ విడుదల!

Big Stories

Advertisement
×