E-Paper
Advertisement

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!
Advertisement

E20 Petrol Adulteration: కర్ణాటకలోని పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న పెట్రోల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ కలుపుతున్నట్లు వెల్లడైంది. నిబంధనల ప్రకారం పెట్రోల్‌లో గరిష్ఠంగా 20 శాతం (E20) వరకే ఇథనాల్‌ను కలపాల్సి ఉండగా.. కొన్నిచోట్ల ఇది ఏకంగా 31 శాతానికి పైగా నమోదవడం కలకలం రేపుతోంది. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి రిజ్వాన్ అర్షద్ బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ల్యాబ్ నివేదికలను ఆధారంగా చూపిస్తూ వివరాలను వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. సంబంధిత ఆయిల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. దీనివల్ల నష్టపోయిన వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు

కల్తీ అనుమానాలతో తమ శాఖ అధికారులు కర్ణాటక వ్యాప్తంగా 63 పెట్రోల్ శాంపిళ్లను సేకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పెట్రోల్ శాంపిల్‌లో ఏకంగా 31.2 శాతం ఇథనాల్ నమోదైందని పేర్కొన్నారు. హిందూస్థాన్ పెట్రోలియం (HPCL) శాంపిల్‌లో 30.5 శాతం, భారత్ పెట్రోలియం (BPCL)లో 26.5 శాతం, నయారాలో 26.1 శాతం, షెల్ సంస్థ శాంపిళ్లలో 25.5 శాతం చొప్పున ఇథనాల్ ఉన్నట్లు గుర్తించామన్నారు. బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ E20 నిబంధనలను ఉల్లంఘించి పెట్రోల్‌లో అధిక మొత్తంలో ఇథనాల్ కలిపారని తేలినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

కంపెనీ ల్యాబ్‌లలో దాపరికం

Advertisement

ఈ శాంపిళ్లను మొదట ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐవోసీఎల్, బీపీసీఎల్ సొంత ల్యాబ్‌లకు పంపినట్లు మంత్రి అర్షద్ ఆరోపించారు. ఆ పరీక్షల నివేదికల్లో ఇథనాల్ శాతాన్ని వెల్లడించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఇథనాల్ శాతాన్ని పేర్కొనాల్సి ఉన్నా కంపెనీలు దాన్ని దాచిపెట్టాయన్నారు. దాంతో జాతీయ గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించగా ఈ నిబంధనల ఉల్లంఘన బయటపడిందని ఆయన మంత్రి వివరించారు.

Also Read: ‘పేదలు కాలుష్యం చేయరు.. ధనికులే అసలు కారణం’.. ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం!

వాహనాలపై పడే తీవ్ర ప్రతికూల ప్రభావం

Advertisement

దేశంలోని 35 కోట్లకు పైగా ఉన్న వాహనాల్లో 99 శాతం కంటే ఎక్కువ వాహనాలు E20 పెట్రోల్‌ను తట్టుకునే స్థితిలో లేవని మంత్రి అర్షద్ అన్నారు. 2023 తర్వాతే E20 పెట్రోల్‌ను తట్టుకునే ఇంజన్ల తయారీ ప్రారంభమైందని గుర్తుచేశారు. అవి కూడా చాలా తక్కువ వాహనాల్లో ఈ సామర్థ్యం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితిలో పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి మించితే వాహనాలు తీవ్రంగా దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. మోతాదుకు మించిన ఇథనాల్ వల్ల ఇంజన్లలోని రబ్బరు భాగాలు, హోస్‌లు, గ్యాస్కెట్లు, సీళ్ళు త్వరగా పాడైపోతాయన్నారు.

వినియోగదారులకు లక్ష కోట్ల నష్టం!

ఇథనాల్ మోతాదు పెరగడం వల్ల మైలేజీలో కనీసం 10 శాతం మేర కోత పడుతుందని మంత్రి అర్షద్ లెక్కలు వేసారు. ‘E20 పెట్రోల్ ధర లీటర్ కు సగటున రూ.100. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా వాడే 6,200 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను ప్రామాణికంగా తీసుకుంటే, మైలేజీ తగ్గడం వల్ల వినియోగదారులకు ఏటా రూ.62,000 కోట్ల మేర పరోక్ష నష్టం జరుగుతోంది. వాహనాల ఇంజన్ల పాడైపోవడం, రిపేర్ల ఖర్చులను కూడా కలుపుకుంటే ఈ మొత్తం నష్టం సుమారు రూ.1 లక్ష కోట్లకు చేరుతుంది’ అని మంత్రి అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, వాహన తయారీ సంస్థలు కలిసి వినియోగదారుల సొమ్ముతో లబ్ధి పొందుతున్నాయని ఆయన విమర్శించారు.

Also Read: సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

Tags

Related News

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది.. కొత్త ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!

విన్‌ఫాస్ట్ MPV 7 ధర భారీగా తగ్గింపు.. ఏకంగా రూ.4.10 లక్షలు కట్..

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్.. లుక్ అదిరింది గురూ!

Big Stories

Advertisement
×