E-Paper
Advertisement

E20 ఫ్యూయల్ తో ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా? పాత కారు ఓనర్లకు కొత్త టెన్షన్!

E20 ఫ్యూయల్ తో ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా? పాత కారు ఓనర్లకు కొత్త టెన్షన్!
Advertisement

E20 పెట్రోల్ వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో వాహనదారులకు మరో కొత్త ఆందోళన మొదలయ్యింది. E20 ఇంధనం వల్ల పాత వాహనాలకు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా E20 ప్రమాణాలకు అనుగుణంగా లేని కార్ల యజమానుల్లో ఈ అంశంపై సందేహాలు పెరుగుతున్నాయి.

2025 నుంచి E20 ప్యూయల్ అందుబాటులోకి!

2025 ఏప్రిల్ నుంచి దేశంలో E20 పెట్రోల్‌ ను ప్రామాణిక ఇంధనంగా అమలు చేస్తున్నారు. అంటే, ప్రస్తుతం సాధారణ పెట్రోల్ బంకుల్లో లభించే పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. అయితే, భారత రోడ్లపై ఇప్పటికీ లక్షల సంఖ్యలో E10, అంతకంటే తక్కువ ఇథనాల్ మిశ్రమాలకు మాత్రమే అనుకూలంగా తయారైన వాహనాలు ఉన్నాయి.

Advertisement

ఇటీవల ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ICICI లోంబార్డ్ విడుదల చేసిన ఓ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. అందులో E20కి అనుకూలంగా రూపొందించని వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడితే, భవిష్యత్తులో జరిగే కొన్ని రకాల నష్టాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు మరింత పరిశీలించాల్సి రావచ్చని వెల్లడించింది. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆందోళనలు వ్యక్తమవడంతో ICICI లోంబార్డ్ తర్వాత స్పష్టత ఇచ్చింది. కేవలం E20 ఇంధనం వాడినందుకు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటు కోల్పోదని వెల్లడించింది. అలాగే పాత వాహనాల్లో E20 వాడటాన్ని తాము నిర్లక్ష్యంగా పరిగణించబోమని వివరించింది. తాజా వివరణ ప్రకారం.. ప్రమాదం, ఇతర కారణాలతో బీమా క్లెయిమ్ దాఖలు చేసినప్పుడు వాహనంలో E20 ఇంధనం ఉండటం మాత్రమే తిరస్కరణకు కారణం కాదని తెలిపింది. సాధారణంగా ఆమోదించే క్లెయిమ్‌లు E20 వాడినా కూడా యాక్సెప్ట్ అవుతాయని చెప్పుకొచ్చింది.

E20 వల్ల దీర్ఘకాలిక నష్టాలు తప్పవా?

ఇప్పుడు ఈ చర్చ E20 వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలపై పడింది. ఇథనాల్ మిశ్రమం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని పాత వాహనాల్లో ఇంధన వ్యవస్థ భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాస్కెట్లు, రబ్బరు సీల్స్, ఇంధన పైపులు, ట్యాంక్ భాగాలు నెమ్మదిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చాలా సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇలాంటి నష్టాలకు కవరేజీ ఇవ్వవు. ఇంజిన్ ప్రొటెక్షన్ లాంటి  అదనపు ఇన్సూరెన్స్ కవరేజీలు తీసుకున్నా కూడా ఇంజిన్ లోకి నీరు చేరడం, ఆయిల్ లీకేజీ లాంటి సమస్యలకు మాత్రమే వర్తిస్తాయి. ప్యూయల్ వల్ల కలిగే సమస్యలకు సాధారణంగా కవరేజీ ఉండదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

E20 వాడటం వల్ల మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రిజెక్ట్ కావని స్పష్టత వచ్చినప్పటికీ, దీర్ఘకాలిక నష్టాలకు సంబంధించిన అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అందుకే, వాహనదారులు తమ వాహనం E20కు అనుకూలమా? కాదా? అనేది ఒకసారి పరిశీలించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: భారీ బ్యాటరీతో రాబోతున్న BMW iX5.. ఒకే ఛార్జ్‌ తో తో కళ్లు చెదిరే రేంజ్!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×