Samsung Galaxy A35: ఒక మంచి బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ (Samsung Galaxy A35 5G) మెుబైల్ పై బంపరాఫర్ ప్రకటించింది. ఫోన్ ధరను ఏకంగా రూ. 14 వేలకు పైగా తగ్గించింది. తక్కువ బడ్జెట్ లో ప్రీమియం ఫీచర్లు ఆశిస్తున్న మిడిల్ క్లాస్ ప్రజలకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ కు సంబంధించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
గెలాక్సీ A35 5G మెుబైల్ ను రూ.32,999 ధరకు శాంసంగ్ ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్ కార్ట్.. వివిధ ఆఫర్ల కింద ఈ ఫోన్ ను రూ.18,999కే అందిస్తోంది. అంటే 44 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ ను దక్కించుకునే వెసులుబాటును ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది.
అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ (Flipkart Axis Bank), ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ పై అదనంగా మరో రూ. 950 వరకు రాయితీ ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ ను రూ. 18,049 కే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తక్కువకే ఈ ఫోన్ ను పొందొచ్చని పేర్కొంది. సరిపడనంత డబ్బు లేకున్నా.. నెలకు కేవలం రూ. 668 ఈఎంఐతో ఫోన్ ను దక్కించుకునే అవకాశాన్ని సైతం ఈ-కామర్స్ దిగ్గజం అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A35 ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.6 అంగుళాలు Full HD+ Super AMOLED స్క్రీన్ ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ను దీనికి అందించారు. శాంసంగ్ ఎగ్జినోస్ 1380 (Exynos 1380) ఆక్టా కోర్ ప్రాసెసర్ తో ఇది వర్క్ చేయనుంది. కెమెరా పరంగా చూస్తే.. ఫోన్ వెనుకవైపు 50MP ఓఐఎస్ + 8MP + 5MP ట్రిపుల్ కెమెరా సెటప్.. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీని సైతం దీనికి అందించారు.
Also Read: ఒకే ఒక్క రీచార్జ్.. ఏడాది మొత్తం ఫ్రీ 5G, కాల్స్, ఓటీటీ.. జియో దుమ్మురేపే ప్లాన్!
రూ. 20,000 బడ్జెట్‌లో ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్, ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లే, శామ్‌సంగ్ బ్రాండ్ వాల్యూ వస్తుండటం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ డీల్ పక్కా ‘పైసా వసూల్’ అని టెక్ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలో ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని స్పష్టం చేస్తున్నాయి. అయితే గేమర్లకు ఈ ఫోన్ అంతగా సపోర్ట్ చేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read: భారీ బ్యాటరీతో రాబోతున్న BMW iX5.. ఒకే ఛార్జ్ తో తో కళ్లు చెదిరే రేంజ్!