E-Paper
Advertisement

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!
Advertisement

Top Strong Hybrid Cars India: దేశంలో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. పూర్తిగా పెట్రోల్ కారు కొనాలా? లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలా? అనే అనుమానంలో ఉన్నవారికి స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ కార్లు తక్కువ వేగంలో బ్యాటరీతో నడుస్తాయి. అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్ కూడా పనిచేస్తుంది. దీంతో ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు, ఛార్జింగ్ గురించి ఆందోళన కూడా ఉండదు. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి మైలేజీ, ఆధునిక ఫీచర్లు అందిస్తున్న కొన్ని స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ 5 మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా / టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్

ఈ రెండు ఎస్‌యూవీలు ఒకే ప్లాట్‌ ఫామ్‌పై తయారయ్యాయి. 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయి. సిటీ ట్రాఫిక్‌ లో కొంత దూరం పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ప్రయాణిస్తాయి. ఇవి లీటర్‌కు సుమారు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ / మారుతి ఇన్విక్టో

Advertisement

పెద్ద కుటుంబాలకు ఈ రెండు ఎంపీవీలు మంచి ఆప్షన్ కానుంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. మొత్తం 186 PS పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఒకవైపు మంచి పనితీరు అందిస్తూనే, మరోవైపు సుమారు 23.24 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. 7, 8 సీట్ల ఆప్షన్, పెద్ద క్యాబిన్, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది.

హోండా సిటీ e:HEV

సెడాన్ కొనాలనుకునేవారికి హోండా సిటీ హైబ్రిడ్ మంచి ఆప్షన్‌ గా కొనసాగుతోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ట్విన్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్ అందించారు. సిటీలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ప్రయాణించే సామర్థ్యం ఉంది. 27.13 kmpl వరకు మైలేజీ అందిస్తుంది. ADAS భద్రతా ఫీచర్లు, పెద్ద క్యాబిన్, పెద్ద బూట్ స్పేస్ ఈ కారును మరింత ఆకట్టుకునేలా చేస్తాయి.

మారుతి విక్టోరిస్

Advertisement

మారుతి కొత్తగా పరిచయం చేసిన విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కూడా వినియోగదారులను ఆకట్టకుంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు e-CVT గేర్‌ బాక్స్ అందించారు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి మైలేజీ, ఆధునిక ఫీచర్లు ఈ మోడల్ ప్రత్యేకతలు. లెవెల్-2 ADAS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హోండా ZR-V

హోండా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన ZR-V కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తోంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ట్విన్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నాయి. మొత్తం 184 PS పవర్‌ ను ఉత్పత్తి చేసే ఈ SUV, 22.8 kmpl వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రీమియం డిజైన్, మంచి ఇంటీరియర్, అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

Read Also: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

Tags

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×