E-Paper
Advertisement

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!
Advertisement

Top 10 Best Selling Cars India July 2026: జూలై 2026లో భారత కార్ల మార్కెట్‌లో మరింత దూకుడు కొనసాగింది. గత నెలలో మాదిరిగానే మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల లిస్టులో ఏకంగా ఆరు మోడళ్లు స్థానం సంపాదించాయి. మారుతి డిజైర్ మళ్లీ నంబర్-1 స్థానాన్ని దక్కించుకోగా, టాటా పంచ్, మారుతి ఎర్టిగా తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించాయి.

అమ్మకాల్లో నెంబర్ వన్ గా డిజైర్

మారుతి సుజుకి డిజైర్ జూలైలో 23,791 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వాగన్‌ ఆర్ 23,338 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎర్టిగా 21,606 యూనిట్లతో మూడో స్థానం, స్విఫ్ట్ 21,538 యూనిట్లతో నాలుగో స్థానం దక్కించుకోగా, టాటా పంచ్ 21,313 యూనిట్లతో టాప్5లో చోటు సంపాదించింది.

పంచ్ ను వెనక్కి నెట్టి మరీ..

Advertisement

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజైర్ అత్యధిక అమ్మకాలు సాధించిన కారుగా నిలవడం ఇది మూడోసారి. ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన ఈ సెడాన్, జూన్‌ లో కాస్త వెనుకబడింది. టాటా పంచ్‌ ఆ స్థానంలోకి వెళ్లింది. జూలైలో మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, డిజైర్‌కు వినియోగదారుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

జూలైలో టాప్ 10 అమ్మకాల లిస్టులో మారుతి సుజుకికి చెందిన డిజైర్, వాగన్‌ ఆర్, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బాలెనో మోడళ్లు చోటు దక్కించుకున్నాయి. అంతేకాదు, మొదటి నాలుగు స్థానాలను కూడా మారుతి కార్లే దక్కించుకోవడం విశేషం. సెడాన్, హ్యాచ్‌ బ్యాక్, ఎంపీవీ, క్రాస్‌ ఓవర్ ఎస్‌యూవీ లాంటి అన్ని విభాగాల్లో కంపెనీ సత్తా చాటింది.

జూలైలో సత్తా చాటిన పంచ్

Advertisement

ఈ నెల టాటా పంచ్‌కు అరుదైన గుర్తింపు పొందింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 21,313 యూనిట్లను సేల్ చేసి కొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన పంచ్, జూలైలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ అమ్మకాల పరంగా మరో మైలురాయిని అందుకుంది.

అటు, మారుతి సుజుకి ఎర్టిగా కూడా 21,606 యూనిట్ల అమ్మకాలతో అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. పెద్ద కుటుంబాలకు అనువైన ఎంపీవీగా ఎర్టిగా ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది. జూలైలో మూడో స్థానంలో నిలిచి తనకంటూ ప్రజాదరణ దగ్గలేదని నిరూపించుకుంది.  మరోవైపు హ్యుందాయ్ క్రెటా కూడా జూలైలో టాప్ 10 లిస్టులోకి చేరింది. ఈ ఎస్‌యూవీ 18,088 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే క్రెటాకు అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం. మొత్తంగా జూలై నెల భారత కార్ల మార్కెట్‌ లో మారుతి సుజుకి పూర్తిగా తన హవాను కొనసాగించింది. అదే సమయంలో టాటా పంచ్, ఎర్టిగా లాంటి మోడళ్లు కొత్త అమ్మకాల రికార్డులను నమోదు చేసింది.

Read Also: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

Tags

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×