E-Paper
Advertisement

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘AK47’ రిలీజ్ డేట్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘AK47’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement

AK47 Release Date: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47” (AK47) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read also-ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ.14,000 తగ్గింపు!

క్రేజీ కాంబో.. భారీ అంచనాలు

Advertisement

గతంలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ అందించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం కథ, మాటలు మాత్రమే అందించారు. మొదటిసారి వెంకీని డైరెక్ట్ చేసే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకోవడంతో, ఈ ‘AK47’పై టాలీవుడ్‌లో సరికొత్త అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు అక్టోబర్ 2 (శుక్రవారం) గాంధీ జయంతి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, ఉదయ్ బీర్ సందు (విలన్ పాత్రలో) కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (ఎస్. రాధాకృష్ణ) నిర్మాణంలో ఈ సినిమా రానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Read also-శర్వానంద్, శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. ‘జార్జ్ క్రిష్’గా సంక్రాంతి బరిలోకి చార్మింగ్ స్టార్!

ఈ సినిమాలో వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, వింటేజ్ కామెడీతో పాటు త్రివిక్రమ్ శైలి ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలోనే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ లాంగ్ వీకెండ్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘AK47’ టీమ్ పక్కా ప్లానింగ్‌తో వస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ అప్‌డేట్స్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు.

Related News

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

Big Stories

Advertisement
×