E-Paper
Advertisement

రూ.1 లక్షలోపు హీరో ఎలక్ట్రిక్ స్కూటర్, ఇక ఆ మోడల్స్ కు చుక్కలే!

రూ.1 లక్షలోపు హీరో ఎలక్ట్రిక్ స్కూటర్, ఇక ఆ మోడల్స్ కు చుక్కలే!
Advertisement

Hero Plans Affordable EV Scooter: భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో మోటో కార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ద్వారా మార్కెట్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.

రూ. లక్షలోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్

తాజా ప్లాన్‌ లో భాగంగా, హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఆగస్టు 2026లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త స్కూటర్ తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధర రూ. 1 లక్ష లోపే ఉండే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ధర పరంగా కొంత ఎక్కువగా ఉండటంతో, ఈ కొత్త మోడల్ మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Vida V1 సిరీస్‌తో మార్కెట్ లోకి ఎంట్రీ

Advertisement

ఇప్పటి వరకు Vida V1 సిరీస్‌ తో హీరో మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత మరింత సరసమైన ధరలతో VX2 మోడళ్లను కూడా తీసుకొచ్చింది. విడా మోడల్స్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం విడా బ్రాండ్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్‌ లలో నాలుగో స్థానంలో ఉంది.  కొత్తగా రాబోయే ఈ స్కూటర్‌లో ఫిక్స్‌ డ్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. అంటే, బ్యాటరీని వేరుగా తీసి ఛార్జ్ చేసే విధానం కాకుండా, స్కూటర్‌ కే అమర్చిన బ్యాటరీ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫిక్స్‌డ్ బ్యాటరీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే, హీరో కూడా ఇదే సెగ్మెంట్‌ ను లక్ష్యంగా చేసుకుంటోంది.

బ్యాటరీ గురించి..

ఈ కొత్త స్కూటర్‌ లో సుమారు 3.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చని సమాచారం. ఇది రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌ ను అందించే అవకాశం ఉంది. తక్కువ ధరతో పాటు సరైన పనితీరు ఇవ్వగలిగితే, ఇది మార్కెట్లో మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి హీరో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో విడా యుబెక్స్ వంటి కొత్త మోడళ్లు కూడా ఉంటాయి.

ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెంపు

Advertisement

ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి సుమారు 3.3 లక్షల యూనిట్లు ఉంది. దీనిని 2027 నాటికి 6.6 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు రెట్టింపు ఉత్పత్తి. ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీ సిటీలో ఉన్న ప్లాంట్‌ లో ఈ స్కూటర్ల తయారీ జరుగుతోంది. అక్కడ కూడా ఉత్పత్తి సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. మార్కెట్ గణాంకాలను చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమ్మకాల సంఖ్య పెరుగుతుండటంతో పాటు, మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు కంపెనీకి మరింత లాభం చేకూర్చే అవకాశం ఉంది.

Read Also: యమహా బైక్ ధరలు పెంపు, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×