E-Paper
Advertisement

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Hyundai Ioniq P EV: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి మరో కొత్త SUV రాబోతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) తొలి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని దేశీ మార్కెట్ కు పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది.  ఐయోనిక్ P (Ioniq P) పేరుతో రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును 2027 జనవరి 16న ఆవిష్కరించనుంది. నాలుగు మీటర్ల లోపు పొడవుతో రానున్న ఈ SUVపై ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి నెలకొంది.

బాక్సీ డిజైన్.. సూపర్ లుక్..

హ్యుందాయ్ ఐయోనిక్ P టెస్ట్ వెహికల్స్ ఇప్పటికే రోడ్ల మీద  కనిపించాయి. వీటిని బట్టి ఈ SUV బాక్సీ డిజైన్‌ ను కలిగి ఉండనుంది. హ్యుందాయ్ వెన్యూ తరహాలో కాంపాక్ట్‌ గా కనిపించే ఈ కారులో ముందు, వెనుక LED లైట్ బార్‌లు ఉండే అవకాశం ఉంది. స్క్వైర్ షేప్ హెడ్‌ ల్యాంప్స్, చిన్న ఓవర్‌ హ్యాంగ్స్, బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వెనుక వైపు D పిల్లర్లు, ట్విన్ రిడ్జ్ రూఫ్ స్పాయిలర్ కూడా ఉండనున్నాయి.

లెవల్ 2 ADASతో అధునాతన ఫీచర్లు

Advertisement

కారు ఇంటీరియర్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇందులో హ్యుందాయ్ కొత్తగా పరిచయం చేసిన ప్లియోస్ కనెక్ట్ (Pleos Connect) ఇంటర్‌ఫేస్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా లెవల్ 2 ADAS ఫీచర్‌ను ఈ కారులో అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటితో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం మరిన్ని అత్యాధునిక ఫీచర్లు అందించే అవకాశం ఉంది.

రెండు బ్యాటరీ ఆప్షన్లతో ఐయోనిక్ P

ఈ ఎలక్ట్రిక్ SUV హ్యుందాయ్ E-GMP (K) ప్లాట్‌ఫామ్‌పై తయారుకానుంది. ఇందులో స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. హ్యుందాయ్ ఇన్‌స్టర్ EVలో 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్‌ల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇవి వరుసగా 300 కిలోమీటర్లు, 355 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి. 42kWh బ్యాటరీ వెర్షన్ 97hp శక్తిని, 49kWh వెర్షన్ 115hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు వెర్షన్లలోనూ 147Nm టార్క్ లభిస్తుంది. ఈ కారు ధరలను 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆటో ఎక్స్‌ పోలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా నెక్సాన్ EV, కియా సైరోస్ EV, మహీంద్రా XUV 3XO EV లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

Read Also: మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!

Tags

Related News

లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

తక్కువ బరువు, మంచి రేంజ్‌.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!

ఎంజీ కామెట్ కొనేవారికి షాక్.. మరోసారి పెరిగిన ఎలక్ట్రిక్ కారు ధరలు!

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

భారత్‌లోకి మరో కొత్త కార్ల బ్రాండ్.. JSW మోటార్స్ లోగో విడుదల!

Big Stories

Advertisement
×