Electric Scooters for Girls: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే మహిళలు రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకోవాలనుకుంటున్నారు. అయితే, స్కూటర్ కొనేటప్పుడు లుక్ మాత్రమే కాకుండా బరువు, సీటు ఎత్తు, రేంజ్, స్టోరేజ్ లాంటి విషయాలను కూడా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో లేడీస్ ఈజీగా నడిపే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం..
రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి, మార్కెట్ పనులకు ఉపయోగపడే స్కూటర్ కోసం చూస్తున్నవారికి TVS iQube మంచి ఆప్షన్. ఇందులో స్మూత్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ తో పాటు అవసరమైన ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ ఆప్షన్లను బట్టి సుమారు 94 నుంచి 212 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. కుటుంబ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.
మహిళల రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫ్యామిలీ స్కూటర్లలో Ather Rizta ఒకటి. సౌకర్యవంతమైన సీటింగ్, మంచి స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంటుంది. కూరగాయలు, షాపింగ్ బ్యాగులు తీసుకెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
స్కూటర్ నడిపేటప్పుడు రెండు కాళ్లు నేల మీద అందాలని కోరుకునేవారికి Honda QC1 బాగుంటుంది. దీని సీటు ఎత్తు 704 మి.మీ.గా ఉంది. తక్కువ సీటు ఎత్తు వల్ల స్కూటర్ మీద కూర్చోవడం, ఆపడం ఈజీగా ఉంటుంది.
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారు Ampere Magnus Neoను చూడవచ్చు. దీని బరువు సుమారు 103 కిలోలు కాగా, సీటు ఎత్తు 777 మి.మీ.గా ఉంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండే ఈ స్కూటర్ బడ్జెట్ కొనుగోలుదారులకు బాగుంటుంది.
తక్కువ దూరాలకు ప్రయాణించే వారికి Ola Gig మంచి ఆప్షన్. దీని రేంజ్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 112 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణాలు చేయాలనుకునేవారు దీన్ని చూడవచ్చు.
కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చే Zelio Little Gracy తక్కువ దూర ప్రయాణాలకు అనువైన మోడల్. కాలేజీకి వెళ్లడం, దగ్గరలోని షాపులకు వెళ్లడం లాంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. చిన్న సైజు స్కూటర్ కావాలనుకునేవారు ఈ స్కూటర్ తీసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు మీ ఎత్తుకు సీటు సరిపోతుందో లేదో చూడాలి. స్కూటర్ బరువును ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? లేదా? అనేది టెస్ట్ రైడ్ ద్వారా తెలుసుకోవాలి. బ్యాటరీ వారంటీ, ఛార్జింగ్ టైమ్, రేంజ్, సర్వీస్ సదుపాయాలను చెక్ చేయాలి.
Read Also: తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!