Best Mileage Scooters In India: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త స్కూటర్ కొనాలనుకునే వారు మైలేజ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రోజూ ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్ ఉపయోగించేవారు తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ దూరం ప్రయాణించే మోడళ్ల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి మైలేజ్‌తో పాటు ఆకట్టుకునే డిజైన్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే పలు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 5 మోడల్స్ గురించి తెలుసుకుందాం..
మైలేజ్ విషయంలో యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు సుమారు 71 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులోని హైబ్రిడ్ అసిస్ట్ టెక్నాలజీ, తక్కువ బరువు ఎక్కువ మైలేజ్ కు కారణం అవుతున్నాయి. స్టైలిష్ లుక్‌తో పాటు మంచి మైలేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ ఒకటి. వేరియంట్‌ను బట్టి లీటర్‌కు సుమారు 53.84 నుంచి 61.2 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన ఇంజిన్ పనితీరు, రోజువారీ ప్రయాణాలకు అనువైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
హీరో డెస్టినీ 125 కూడా మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ మోడల్ లీటర్‌కు సుమారు 59 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 125 సీసీ ఇంజిన్‌తో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. వేరియంట్, రైడింగ్ కండీషన్స్ ను బట్టి ఇది లీటర్‌కు సుమారు 47 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మంచి ఇంజిన్, లో మెయింటెనెన్స్, ఈజీ హ్యాండ్లింగ్ లాంటి అంశాలు యాక్టివాను కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.
మ్యాక్సీ స్కూటర్ తరహా డిజైన్ తో ఆకట్టుకునే సుజుకి బర్గ్ మన్ స్ట్రీట్ 125 కూడా మంచి మైలేజ్ అందిస్తుంది. ఇది లీటర్‌కు సుమారు 48 నుంచి 58.5 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆకట్టుకునే లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
ఈ ఐదు స్కూటర్లలో యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మైలేజ్ లో ముందుంది. స్కూటర్ వాస్తవ మైలేజ్ ట్రాఫిక్, రోడ్డు పరిస్థితులు, ప్రయాణించే వారి బరువు, టైర్లలో గాలి, డ్రైవింగ్ స్టైల్ మీద ఆధారపడి మారుతుంది. అందువల్ల స్కూటర్ కొనుగోలు చేసే ముందు అన్న వివరాలను తెలుసుకోవడం మంచిది.
Read Also: తక్కువ బరువు, మంచి రేంజ్.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!